శ్రీవారి భక్తులకు ఒక గొప్ప శుభవార్త.. ఏమిటంటే..!!

Divya
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటని చెప్పవచ్చు.. ఇక ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ప్రతిరోజు. అయితే గత కరోనా కారణంగా కొన్ని నెలలు మూసివేయడం జరిగింది. అయితే ఈ ఏడాది కారోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో. మళ్లీ దేవాలయాలు పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాయి. అయితే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు శుభవార్త తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి.. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు మొదలు పెట్టనున్నట్లు ఆ దేవస్థానం అధికారులు నిర్ణయించారు. తిరుపతి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించాలని.. అందుకు భక్తులను అనుమతించాలని ttd సంస్థ నిర్ణయించింది. అందుకోసం ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీ వారికి నిత్య సేవలలో భాగమైన సుప్రభాతం, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తోమాల , అభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకరణ సేవ లు.. నిర్వహిస్తారట. కరుణ పరిస్థితులకు ముందు విధానంలో ఆర్జిత సేవలను ఎలాగైతే బుకింగ్ చేశారు ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందని తెలియజేశారు.
అదేవిధంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకార  వంటి సేవలకు భక్తులు నేరుగా పాల్గొనవచ్చని అధికారులు తెలియజేశారు. ఇక వీటితో పాటుగా వర్చువల్ విధానాన్ని కూడా కొనసాగుతుందని తెలిపారు. వర్చువల్ సేవలు బుకింగ్ చేసుకున్న భక్తులు ఆయా సేవలలో డైరెక్టుగా పాల్గొనే అవకాశం లేదట. వీరికి దర్శనం కల్పించడంతోపాటు.. ప్రసాదాలు కూడా అందిస్తారట ఇక అడ్వాన్స్ బుకింగ్ ఆర్జిత సేవలు చేసుకున్నవారికి.. ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శనం సేవలు కూడా చేసుకొని సదుపాయాన్ని అందిస్తుందట. ఈ సేవలను ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కోవిల్ నిబంధనలు పాటిస్తూ అనుమతించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: