బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ ఆ జిల్లాలకు ముప్పు..!!
ఇక ఈ నెల 4వ తేదీ నుండి నెల్లూరు, చిత్తూరు, కడప వంటి పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షం 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక వీటితో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నది. ఇక ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అక్కడక్కడ వానలు పడతాయి అని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇక ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నది వాతావరణ శాఖ.
ప్రజలు ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచిస్తున్నది.. ఇక వీరితో పాటే మృత్యు కారులను కూడా వేటకు వెళ్లొద్దని తెలియజేస్తోంది. ఇప్పటి వరకు ఎవరైనా సముద్రంలోకి వేటకు వెళ్లిన వారు త్వరగా తిరిగి రావాలని హెచ్చరిస్తున్నది. అయితే గతంలో జరిగిన వరదల బీభత్సం కారణంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది వాతావరణ శాఖ. గతంలో కూడా చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కోరడం జరిగింది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో 24 మందికి పైగా మృతి చెందారు.