విధి నిర్వహణలో ఘోర రోడ్డు ప్రమాదంతో మృతి చెందిన పోలీసులు..!!

Divya
ప్రతిరోజు ప్రయాణం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వెళుతూ ఉండాలి.. అయితే అలా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.. ఇప్పుడు తాజాగా ఒడిస్సా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది.. పాపడహండి పరిధిలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో ని కొంతమంది పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు ఒకటి బోల్తా పడడం జరిగింది. బస్సు బోల్తా పడడంతో అందులోని ముగ్గురు పోలీసులు మరణించారు. వారితో ప్రయాణించిన 14 మందికి గాయపడడం జరిగింది.
ఇక అక్కడ ఉండేటువంటి.. జిల్లా ఆస్పత్రిలో కి హుటాహుటిగా తరలించారు.. హోటల్లోని రిపోర్టు ప్రకారం..40-45 మంది పోలీసు సిబ్బంది తో కూడిన ఒక బస్సు.. పాపడహండి నుండి కొసగుమడుగు వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఆ బస్సు డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ కూడా.. అదుపు చేయలేక పోవడంతో మలుపు దగ్గర నుండి 15 అడుగుల మేరకు బస్సు దూసుకు పోయినట్లుగా సమాచారం. అక్కడున్న స్థానికులు అందించిన సమాచారం కారణంగా పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగిందట. అక్కడే ఉండి స్థానికుల సహాయంతో నే గాయపడిన పోలీసులను సిబ్బంది రక్షించడం జరిగింది. అయితే అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించే మార్గంలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం.
మృతి చెందిన వారిలో రవి బిసొమ్, సి.హెచ్. శేషారావు, జగబందుకు గౌడగా గుర్తించినట్లు సమాచారం.. ఇక ఇలాంటి సిబ్బందిని కోల్పోయినందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. వీరిపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే పాపడహాండి సమీపంలోని రోడ్డు పంచాయతీ ఎన్నికల అధికారి ని హత్య చేసినట్లుగా వార్త వినిపించడంతో ఆ వార్త తనకు చాలా బాధ కలిగించింది అని తెలియజేశారు.. గాయపడిన పోలీసులు వెంటనే కోరుకునే విధంగా వారికి చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు. మృతుని కుటుంబానికి భగవంతుడు కాస్త ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ధర్మేంద్ర ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: