అఫీషియల్ : సూర్య మూవీలో పూజా హెగ్డే... ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు , తమిళ , హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా అపజయాలను సాధించడంతో ఈమెకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మళ్లీ ఈమెకు వరస పెట్టి సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య హీరో గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే మూవీ లో ఈ బ్యూటీ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లు అందులో భాగంగా ఇప్పటికే మేకర్స్ ఈమెను కలిసి ఈ సినిమా కథను , అందులో ఆమె పాత్రను వివరించినట్లు ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సూర్య హీరో గా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ధ్రువీకరిస్తూ పూజా హెగ్డే కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో కనుక పూజ హెగ్డే కి మంచి విజయం దక్కినట్లయితే ఈమెకు మళ్ళీ వరుస సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: