ముంచుకొస్తున్న మంచు ముప్పు.. పతనం తప్పదా..!

MOHAN BABU
అంటార్కిటికా ఖండం పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే కేవలం  తీవ్ర ప్రాంత నగరాలు కనుమరుగు కావడమే కాదు మానవాళి మొత్తం ముప్పు ముంగిట నిలిచే అవకాశం ఉంటుంది. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ఇందులో కొత్తేముంది అనుకోకండి. ఆ ప్రమాదం ఇప్పుడు మన వరకు చేరే అవకాశం ఉంది. మంచు దుప్పటి మెల్లగా వీడిపోతుంది. మంచు కొండలు పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ నీరంతా సముద్రాలలో కలిసి మనపై ఉప్పెన లా విరుచుకు పడేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రమాద స్థాయిని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. అత్యంత ప్రమాదకర ప్రాంతంలోకి అడుగుపెడుతున్నారు.

అంటార్కిటికా పేరు చెప్పగానే అందమైన,ఆహ్లాదకరమైన ప్రదేశం మన కళ్ల ముందు మెదులుతుంది. భారీ మంచి ఫలకాలు, ఆ మధ్యలో పెంగ్విన్లు. ఆ ప్రకృతి అందాలు వర్ణించడానికి భాష చాలదు. అలాంటి అందమైన ప్రాంతం మన విధ్వంసకర చర్యలతో పూర్తిగా నాశనమైంది. తిరిగి ఆ ప్రభావం ఇప్పుడు మన మీదే పడేందుకు సిద్ధంగా ఉంది. నానాటికీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కొండలు కనుమరుగవుతున్నాయి. హిమానీనదాలు అసాధారణ రీతిలో కరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రపు నీటి మట్టాలు పెరిగేలా చేస్తున్నాయి. ఇదేదో ఇప్పుడే మొదలైంది కాదు, గత కొన్ని దశాబ్దాల కాలంగా మంచు క్రమంగా కరుగుతూ ముప్పును మోసుకొస్తోంది. ఈ శతాబ్దం చివరి నాటికి మొత్తం మంచు ఫలక అస్థిరంగా మారుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. పశ్చిమ అంటార్కిటికాలో మార్పులు అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంటార్కిటికాలో మొత్తం మంచు కరిగి పోయి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు రెండు వందల అడుగుల మేర పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అయితే అంటార్కిటికాలో పూర్తి మంచు కరగడానికి శతాబ్దకాలం పడుతుందా లేదంటే ఇంకా వేగంగానే ఆ మంచు కరిగిపోతుందా అన్నది శాస్త్రవేత్తలు తేల్చనున్నారు. అంటార్కిటికాలో అడుగు పెట్టడం అంటే అంత సులభం కాదు.అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. అయినా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సాహసమే చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రాణాలకు తెగించి మంచు ఖండం లో అడుగు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: