పెళ్లి రోజే భ‌ర్త మరొక అమ్మాయిని కౌగిలింత‌.. పెళ్లికూతురు రియాక్ష‌న్ ఎలా ఉందంటే..?

N ANJANEYULU
ఏ భార్య అయినా స‌రే త‌న భ‌ర్త కేవ‌లం త‌న‌కు మాత్ర‌మే సొంతం అనుకునే భావ‌న‌లో ఉంటుంటారు.ప‌క్క‌వారి చూపు కాదు క‌దా క‌నీసం నీడ పడ్డా వారు మాట‌ల యుద్ధ‌మే చేస్తుంటారు. అలాంటిది ఏకంగా త‌న ముంద‌టే త‌న భ‌ర్త‌ను కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది మ‌రీ. అందులోనూ మ‌ర‌ల పెళ్లి జ‌రిగిన తొలిరోజే, పెళ్లి వేదిక‌పైనే ఈ విధంగా జ‌రిగితే ఎవ‌రైనా తీవ్ర‌మ‌న‌స్థాపానికి గుర‌వుతారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అయితే చివ‌ర‌లో మాత్రం ఆక‌స‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ ప్ర‌స్తుతం న‌వ్వులు పూయిస్తున్న‌ది.
వివ‌రాల్లోకి వెళ్లితే.. పెళ్లి పూర్తయిన త‌రువాత వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ స్టేజ్‌పై నిల్చొని ఉన్నారు. కొత్త జంట‌ను ఆశీర్వ‌దించ‌డానికి స్నేహితులు, బంధువులు ఒక్కొక్క‌రూ స్టేజ్‌పైకి వ‌స్తూ అభినంద‌నలుతెలియ‌జేస్తూ ఉన్నారు. ఇదే స‌మ‌యంలో బుర‌ఖా ధ‌రించిన ఓ మ‌హిళా కూడా స్టేజ్ పైకి ఎక్కిన‌ది. ముందుగా పెళ్లికూతురికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆ త‌రువాత వ‌రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన‌ది. ఇక అంత‌టితో ఆగ‌కుండా అత‌న్ని గ‌ట్టిగా హ‌త్తుకున్న‌ది. ఎంత‌కూ వ‌ద‌ల‌కుండా అలాగే వాటేసుకోవ‌డంతో ఆ పెళ్లికూతురు ఒక్క‌సారిగా షాక్‌కు గురైన‌ది. ఏమి జ‌రుగుతుందో అర్థంకానీ ఆ అమ్మాయి త‌ల ప‌క్క‌కు తిప్పుకొని ధీనంగా మొహం పెట్టింది.
అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ జ‌రిగిన‌ది. వ‌రుడిని కౌగిలించుకున్న ఆ మ‌హిళా నెమ్మ‌దిగా బుర‌ఖాను తొల‌గించింది. అప్పుడు కానీ తెలియ‌దు ఆ వ్య‌క్తి మ‌హిళా కాదు అని, అబ్బాయి అని వ‌రుడి స్నేహితుడు అత‌డిని ఆట‌ప‌ట్టించడానికి అలా బుర‌ఖా రూపంలో వ‌చ్చాడ‌న్న మాట‌. ఈఘ‌ట‌న చూసిన కొత్త పెళ్లి కూతురు ఒక్క‌సారిగా షాక్‌కు గురైన‌ది. పెళ్లికి హాజ‌రైన వారంతా న‌వ్వ‌డంతో పెళ్లి వేదిక సంద‌డిగా మారింది. దీనంత‌టినీ అక్క‌డే ఉన్న కొంద‌రూ స్నేహితులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన‌ది. ఇది చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట్లో ఒక ఘ‌ట‌న వైర‌ల్ అయిందంటే చాలు దానిపైనే ఒక‌రు కాకుంటే మ‌రొక‌రూ ఏదో ఒక ర‌క‌మైన కామెంట్లు పెడుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: