కరోనా పాజిటివ్ వస్తే అంత దారుణంగా ట్రీట్ చేస్తారా?

Satvika
కరోనా మహమ్మరి నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ కేసులు నమోదు అవుతూన్నాయి. ఇంట్లోనే ఉంటూ కరొన నుంచి కోలుకుంటున్నారు. స్వీయ నిబంధనలు తీసుకొవాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. ఈ వైరస్ నుంచి జనం ఊపిరి పీల్చుకున్నారో లేదో ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతుంది.. ఒమిక్రాన్ కేసులు దేశం లో రోజు రోజుకు పెరుగుతున్నాయి..

విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులోనే టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే వెంటనే నిర్దేశిత కేంద్రాలకు పంపి ఐసొలేషన్ చేస్తున్నారు. ఒకవేళ విమాన ప్రయాణం చేస్తుండగా ఎవరికైనా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయితే పరిస్థితి మాత్రం దారునంగ ఉంటుంది. జనం భయం తో వణికి పోతున్నారు. అయితే విమానంలో కూడా ఇలా టెస్టులు చేస్తారు.. అనే సందేహం రావచ్చు. కాగా ఈ ఘటన అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం  గొంతులో ఏదోలా ఉండటంతో రాపిడ్ టెస్ట్ లు చేసుకుంది.

అందులో తనకు కరోనా సోకినట్టు గా రిపోర్ట్ వచ్చింది. విమానం నిండా ప్రయాణికులే. ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. పాజిటివ్ వచ్చిన ఆ మహిళ ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక సతమతం అయింది. అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా ఆమె ఒంటరిగా ఉన్న సీట్ ను వేయించుకుంది.. టాయిలెట్‌నే ఐసొలేషన్ సెంటర్‌గా ఎంచుకుంది. ఫ్లైట్ల్యాండ్ అయ్యే వరకు ఆ టాయిలెట్‌లోనే ఆమె తనను తాను ఐసొలేట్ చేసుకుంది. డిసెంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుంది.తన తో పాటు కలిసి ఉన్న అందరికి కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇది నిజంగా దారుణం అబ్బా.. ఏదైనా ముందే చేసుకోవడం మంచిదే.. ఇప్పుడు ఎంత జాగ్రత్రగా వుంటే చాలా మంచిది.. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కుడా అమలుచెస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: