ఆటోలో మొక్కల పెంపకం.. అదిరిందయ్యా ఐడియా..

Satvika
చెట్లను పెంచడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు.. వాటి వల్ల ఎన్ని లాభాలున్నాయో అందరికి తెలుసు. అయితే చాలా మంది వివిధ ప్రాంతాలలో మొక్కలను నాటుతున్నారు. అందులో కూడా చాలా కొత్తగా ఆలోచనలు చేస్తున్నారు. పర్యావరణం పై మక్కువ తో వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా అటువంటి ఆలోచన చేశాడు. ఇప్పుడు అందరి చేత ప్రసంసలు అందుకుంటున్నారు నిజంగా ఇలాంటి ఐడియాలు రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అధిక శాతం చెట్లను నరికివేసి వాటికి బదులు మొక్కలు నాటే వారే కరువైయ్యారు.

నిత్యం మనం ఉపయోగించే వస్తువులను చెట్ల ద్వారానే తాయారు చేయడం చేస్తారు. మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.. తన ఆటో లో రకరకాల మొక్కలను పెంచడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇది నిజంగా మంచి ఆలోచన.. వివరాల్లొకి వెళితే.. తిరుపతి లో ఓ ప్రకృతి ప్రేమికుడు వినూత్న ప్రయత్నం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. చెట్లు అంతరించి పోతున్నాయి. వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి.

ఇతను స్వతహాగా ఆటోను నడుపుతుండేవాడు.. ప్రకృతి ప్రేమికుడు అయిన ఆయన నగరం లో మొక్కలను నరికి వేయడం చూసి చలించిపోయాడు. తన ఆటో చుట్టూ చిన్న స్టాండుల ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వివిధ రకాల మొక్కలను ఏర్పాటు అందులో ప్రయాణీకులకు మంచి ఆనందాన్ని కలిగించాడు. ఇతను చేస్తున్న ప్రయోగం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. అతణ్ణి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అతను చెప్పే ఆన్సర్ అందరినీ మంత్ర ముగ్దులను చేసింది. వారికి చెట్లను కూడా ఇచ్చి  ఇంటి చుట్టూ వేయమని సలహా ఇచ్చాడు. అంతేకాదు మొక్కలు కావాలంటే తనకూ ఫోన్ చేయమని నెంబరు కూడా ఇస్తున్నాడు.. మొత్తానికి ఇలా కొత్తగా మొక్కలను పెంచి అందరి దృష్టిని ఆకర్షించాడు హీరో అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: