వీడియో : 'నాటు నాటు' పాటపై.. పునీత్ కుమార్ డాన్స్ చేస్తే?

praveen
ఇటీవలే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా నుంచి విడుదలైన నాటు పాట సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టిస్తోంది అని చెప్పలి. చిన్న నుంచి పెద్దల వరకు అందరికీ ఉర్రూతలూగిస్తోంది ఈ పాట. ఇక ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయడం తో.. అందరూ తెగ ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా ఇక ఈ నాటు నాటు పాట వినిపిస్తుంది అనే చెప్పాలి. ముఖ్యంగా నాటు నాటు పాటపై జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన అదిరిపోయే స్టెప్పులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఎంతో మంది డాన్స్ స్టెప్పులు నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

 అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన నాటు నాటు పాట పై అటు దివంగత నటుడు పునీత్  రాజ్ కుమార్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది.  కన్నడ ఇండస్ట్రీ లో పునీత్ రాజ్కుమార్ ఎంత గొప్ప డాన్సర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాల్లో హీరోగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా గొప్ప మనసున్న హీరోగా ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న పునీత్ రాజ్కుమార్ ఆకస్మిక మరణం మాత్రం అందరినీ కలిచివేసింది.

 ఇకపోతే ఇటీవలే  పునీత్ రాజ్కుమార్ అభిమాని ఒకరు నాటు నాటు పాటపై పునీత్ రాజ్ కుమార్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఈ విషయాన్ని తెలిపే విధంగా ఇక ఆయన సినిమాల్లోని కొన్ని పాటలను ఒక వీడియో రూపంలో తయారుచేసి ఇక ఆ వీడియోకు నాటు నాటు పాటను జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. అచ్చం పునీత్ రాజ్కుమార్ నాటు నాటు పాటపై డాన్స్ చేసారేమో అన్న విధంగానే ఇక ప్రస్తుతం ఈవీడియో ఉంది అనీ చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై  ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: