వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

praveen
ఒకప్పుడు పెళ్ళి అంటే ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగింది.. అంతేకాదు వరుడు వధువు పెళ్లి వరకు కూడా ఒకరిని ఒకరు చూసుకునే వారు కాదు. కానీ నేటి రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్  పూర్తిగా మారిపోయింది.. పెళ్లిచూపులు అయ్యాయి అంటే చాలు వరుడు వధువు తరచు కలుసుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా పెళ్ళి ఘనంగా చేసుకోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఫ్రీ వెడ్డింగ్ ఘనంగా చేసుకోవాలని ఎంతో మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్రీ వెడ్డింగ్ కోసం భారీగా ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

 ఇలా ఇక ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు ఎన్నో పర్యాటక ప్రాంతాలలోకి  వెళ్లి ఫోటోలు వీడియోలు ఫోజులు ఇస్తున్నారు పెళ్లి చేసుకోబోయే నూతన వధూవరులు. అయితే ఇలా ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లి కొంత మంది జంటలు ఇబ్బందులు పడటం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఒక జలపాతం వద్దకు వెళ్లారు కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంట. ఇక ఆ జంటతో పాటు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు కూడా వెళ్లారు. ప్రస్తుతం జలపాతం దగ్గర నీళ్లు లేకపోవడంతో ఇక మధ్యలో కి వెళ్లి ఒక బండరాయిపై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టారు.

 అంతలో డ్యామ్ గేట్లు తెరవడంతో ఇక నీళ్లు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. ఈ ఘటన రాజస్థాన్ లోని చిత్తోగర్ జిల్లాలోని చులియా జలపాతం వద్ద చోటు చేసుకుంది. వధూవరులిద్దరు జలపాతం వద్దకు చేరుకుని బండరాళ్లపై కూర్చుని ఫోటోలు దిగుతున్న సందర్భంలో ఎగువన ఉన్న డ్యాం గేట్లు తెరిచారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీగా నీరు వచ్చి వారిని చుట్టుముట్టాయి. ఇక నూతన వధూవరుల తో పాటు అటు వారిని ఫోటో తీయడానికి వెళ్లిన ఇద్దరు ఫోటోగ్రాఫర్లు కూడా ఆ బండరాయిపై చిక్కుకున్నారు. ఎటూ పోలేని పరిస్థితి. ఇక పోలీసులకు సమాచారం అందించడంతో మూడు గంటల పాటు కష్టపడి పోలీసులు వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే తృటిలో పెద్ద ముప్పు తప్పింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: