వామ్మో..ఈ కలప ఖరీదు కిలో అన్ని లక్షల రూపాయలా..?

Divya
కలప అంటేనే అత్యంత ఖరీదైన వృక్షము అని అందరికీ తెలిసిందే.. అంతేకాదు ఈ కలపతో తయారు చేసిన ఏ వస్తువైనా సరే చిరకాలం దృఢంగా ఉంటుంది అనేది నమ్మకం.. అంతేకాదు ఈ కలపతో ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా  ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే కలప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దట.. ఈ కలప కేజీ ఏడు లక్షల రూపాయలు.. ఇక ఈ చెట్టు నుంచి వచ్చే కలప ఒక్కో కేజీ 7  లక్షల రూపాయలు అంటే ,  ఇక ఒక చెట్టు ఎంత ఖరీదు పడుతుందో ఊహించుకోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ కలప వృక్షాలు ఎక్కడ ఉన్నాయి..?ఎందుకు అంత డిమాండ్..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తి వివరాల్లోకి వెళితే..ఆఫ్రికన్‌ బ్లాక్‌వుడ్‌.. ఈ జాతికి చెందిన కలక వృక్షాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ఇక ఈ చెట్ల నుంచి వచ్చే కలపకు ఎందుకు అంత డిమాండ్ అంటే.. ఈ వృక్షాల నుంచి కలప రావడానికి ఏకంగా 50 సంవత్సరాల సమయం పడుతుంది అట. ఇక ఈ మొక్క నాటిన అప్పటి నుంచి యాభై సంవత్సరాలు దాటినా కూడా ఒక్కోసారి కలప రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు సమయం కూడా  పడుతుందట.

ఈ వృక్షాల నుండి 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కలప వృక్షాలు సుమారు 50 అడుగుల వరకూ పెరుగుతాయి అని కూడా వృక్ష శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ కలప వృక్షాలను ఆఫ్రికా లో పెంచుతారు అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ కానీ, వీటి ధర అత్యంత పలకడంతో ఇటీవల జపాన్‌, అమెరికా వంటి కొన్ని ప్రాంతాల్లో పెంచుతున్నారు.ఇక  అంతర్జాతీయంగా కూడా ఈ వృక్షాల నుంచి వచ్చే కలపకు చాలా మంచి డిమాండ్‌ ఉంది. అంతేకాదు ఈ వృక్షాలు నుంచి వచ్చే కలపతో తయారుచేసే వస్తువులు కూడా అత్యంత ఖరీదైన ధర ను పలకడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: