ప్రేమ కోసం అన్ని వదులుకున్న యువరాణి.. ఎవరో తెలుసా..?

MOHAN BABU
ఆనందంగా జీవించడానికి ఆస్తిపాస్తుల తో పనిలేదని భావించింది ఆ యువరాణి ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటానికి కోట్ల ఆస్తితో పాటు, రాచరిక హోదాను తృణప్రాయంగా వదులుకుంటోంది. ఇంతకీ జపాన్ యువరాణి మనసు దోచుకున్న సామాన్యుడు ఎవరు? వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? ఆ యువరాణి పేరు మాకో.. ఒకప్పటి జపాన్ చక్రవర్తి అఖిహిటో కి స్వయానా మనవరాలు. ప్రస్తుతం క్రౌన్ ప్రిన్స్ అక్షినో క్రౌన్, ప్రిన్సెస్ కికో లా సంతానం. త్వరలోనే యువరాణి హోదాను కోల్పోబోతోంది 29 ఏళ్ల మాకో. అంతే కాదు రాజ భరణంగా అందాల్సిన ధనం సైతం ఈమెకు దక్కే అవకాశం లేదు. ఓ సామాన్యుడు తో పెళ్లికి సిద్ధం  కావడమే దీనికి కారణం. యువరాణి మాకో తన కాలేజీ క్లాస్ మేట్ కిమ్ కుమ్రో ని ప్రేమించింది.

కిమ్ కుమ్రో ఓ  సామాన్య కుటుంబానికి చెందిన వాడు. అందువల్ల అతన్ని పెళ్లి చేసుకుంటే రాచరిక హోదాను ఆమె కోల్పోతుంది. రాచరిక చట్టం ప్రకారం పెళ్లి కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే మహిళలకు రాజ భరణంగా 13 లక్షల అమెరికన్ డాలర్లను ఇస్తుంది జపాన్ ప్రభుత్వం. మన కరెన్సీలో చూసుకుంటే సుమారు పది కోట్ల రూపాయలు ఏకమొత్తంగా ఇస్తుంది. రాచరిక గౌరవాన్ని కాపాడడానికి  ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే  రాజ భరణం  చెల్లించాల్సిన అవసరం ఉండదు. యువరాణి హోదాను కోల్పోతుంది. పెళ్లి వేడుక సైతం రాచరిక పద్ధతిలో నిర్వహించరు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా ఓ జపాన్ రాజ కుటుంబానికి చెందిన మహిళ సామాన్యుడిని పెళ్లి చేసుకుంటూ రాజభరణాన్ని కోల్పోతుంది . తనకు డబ్బు,రాచరిక హోదాల కంటే ప్రేమించిన వ్యక్తే ముఖ్యమంటూంది మాకో.

2017లోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు మాకో, తన ప్రియుడు  కిమ్ కుమ్రో ప్రకటించారు. కానీ వీళ్ళ పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. తాము ఎప్పుడు పెళ్లి చేసుకోబోయేది అక్టోబర్ లో ప్రకటిస్తాం అంటుంది మాకో. పెళ్లయ్యాక ఈ జంట అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తనకు అందాల్సిన రాజా భరణం వదులుకోవడానికి మాకో సిద్ధపడినా చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు జపాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే రాజకుటుంబీకులు చర్చించే పనిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: