భారత్ కు చేరిన హవానా సిండ్రోమ్.. లక్షణాలివే..!

Divya
అమెరికాను భయబ్రాంతులకు గురి చేస్తోంది హవనా సిండ్రోమ్. ఇక ఈ వైరస్ ఇప్పుడు భారతదేశానికి వ్యాపించింది అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ నెల మొదట్లో భారత్లో పర్యటించిన USA CIA అధికారులు ఈ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు అమెరికా దేశ మీడియా వర్గాలు వెల్లడించారు. ఇక దాంతో అమెరికా అధికారులు చాలా ఆందోళన చెందుతున్నారు.

CIA డైరెక్టర్ హవానా సిండ్రోమ్ లక్షణాలపై అమెరికా దేశం విస్తారంగా దర్యాప్తు చేయబడుతున్నది. ఇంకా  ఆ బాధితుడి వివరాలను వెల్లడించలేదు USA. కానీ అతనికి వైద్య చికిత్స అందిస్తున్నట్లుగా.. అక్కడి మీడియా సంస్థలు వెల్లడిస్తున్నది. ఇది కేవలం ఇంటిలిజెన్స్ అధికారులకు మాత్రమే వ్యాప్తి చెందినట్లుగా సమాచారం.ఈ వ్యాధి బారిన పడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది అన్నట్లుగా తెలియజేస్తున్నారు.

దాదాపు అయిదు సంవత్సరాల క్రితం నుంచి 200 మంది ఇంటెలిజెన్స్ అధికారులు ఈ వ్యాధి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధి బారిన పడితే జ్ఞాపకశక్తి కోల్పోవడం, భయంకరమైన తలనొప్పి వంటి లక్షణాలు ఈ వైరస్ కి ఉన్నట్లుగా సమాచారం. 2016 లో మొదటిసారిగా యువ రాజధాని హవనాలో పనిచేస్తున్న ఒక దౌత్య అధికారికి ఈ సిండ్రోమ్ వ్యాధిని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా.. క్యూబా, చైనా, ఆస్ట్రేయా, రష్యా, పోలాండ్ లో దౌత్య కార్యాలయంలో పనిచేసే వారు ఈ వ్యాధి బారిన పడినట్లు  గుర్తించింది.
అంతేకాకుండా అమెరికాలోని సైనికులు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది అన్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ వైరస్ గురించి తన సైనికులను అప్రమత్తం చేసింది అమెరికా. ఎవరైనా నా మెదడు సమస్యలతో బాధపడుతుంటే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలి అన్నట్లుగా తెలియజేసింది అమెరికా ప్రభుత్వం. ఇక అదే విధంగా భారత దేశంలో పర్యటించిన కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా ఆ దేశ అధికారులు గుర్తించారు.
ఇక ఈ వ్యాధి ఎలా వస్తుందో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదట. కేవలం ఈ వైరస్ తో బాధపడే వారికి మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గా వైద్య నిపుణులు స్కానింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఒకవేళ ఈ వైరస్ వెనకాల ఏదైనా శత్రుదేశాల కుట్ర ఉన్నట్లుగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: