వైరల్ : ఫుట్ బాల్ ప్లేయర్స్ గా మారిన ఎలుగుబంట్లు.. అంతకు మించి..!

Divya
సాధారణంగా పురుషులు ఫుట్ బాల్ ఆడడం చూసి ఉంటారు .. అలాగే మహిళలు కూడా ఫుట్ బాల్ ఆడడం చూసే ఉంటాం..కానీ ఇక్కడ ఏకంగా ఎలుగుబంట్లు ఫుట్ బాల్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే సాధారణంగా జంతువులు కూడా కొన్ని కొన్ని సార్లు మనుషుల అలవాట్లను అనుసరిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం పెంచుకునే పెంపుడు జంతువులు అయినా సరే అడవిలో తిరిగే జంతువులు అయినాసరే ఒక్కొక్కసారి వాటికి నచ్చినప్పుడు.. మనుషులను అనుకరిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కొన్ని ఎలుగుబంట్లు కూడా కొంతమంది వ్యక్తులతో ఫుట్ బాల్ ఆడుతూ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.. ఇక అదెక్కడో పూర్తి విషయాలు తెలుసుకుందాం..

ఇటీవల కాలంలో ఎక్కువగా పక్షులు, జంతువులు, మనుషులు చేసే పనులు చేసి అందరిని బాగా ఆకర్షిస్తున్నాయి . ఇక ఈ వీడియోలని చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడంతో ఇవి కాస్త నెట్టింత సందడి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఫుట్ బాల్  ప్లేయర్స్ కు మించి ఎలుగుబంట్లు ఫుట్ బాల్ ఆడుతూ ఉండడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వింత ఘటన ఒడిశాలోని నబరంపూర్ జిల్లా సుఖీ గావ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది..
అక్కడ ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఒక మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్నారు.. అకస్మాత్తుగా అక్కడికి రెండు ఎలుగుబంట్లు వచ్చాయి. ఇక వాటిని చూసిన యువకులు తమ ఫుట్ బాల్ ను  అక్కడే వదిలేసి , అక్కడి నుంచి పరిగెత్తారు. అయితే ఎలుగుబంట్ల దృష్టికి బాల్ ఎంతో విచిత్రంగా అనిపించడంతో , కొద్దిసేపు ఆ బాల్ తో ఫుట్ బాల్ ఆడటం మొదలు పెట్టాయి. ఇక ఫుట్ బాల్ను అటూ ఇటూ కదుపుతూ.. మనుషుల్లాగే తమలో ఉన్న ప్రతిభను అందరికీ చూపించాయి. వీటి ఆటను చూసిన గ్రామ యువకులు భయం భయంగానే వీడియోలు చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో, ప్రస్తుతం ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి ఈ వీడియోలు. ఏది ఏమైనా ప్లేయర్స్ కు మించి ఫుట్ బాల్ ఆడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: