వైరల్: వృద్ధురాలి కొంపముంచిన ఆధార్ కార్డు.. కారణం..?

Divya
ఇటీవల ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అత్యవసరం అయిపోయింది.. ముఖ్యంగా భారతదేశంలో జీవించాలి అంటే ఈ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ఇకపోతే ఇంతటి తప్పనిసరిగా మారిపోయిన ఈ ఆధార్ కార్డు ఒక వృద్ధురాలు కొంపముంచిందట. అందుకు గల కారణమేమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణంలో గాంధీ చౌక్ ఏరియా లో షేక్ అమ్మినబి అనే ఒక వృద్ధురాలు జీవిస్తోంది. ఈమె గత 50 సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తూ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇకపోతే ఈమె భర్త గత 30 సంవత్సరాల క్రితమే మరణించడంతో..వున్న  నగదు అలాగే సంపాదనతో తన ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం చేసి అత్తవారింటికి సాగనంపింది షేక్ అమ్మినబి. ఇక గత 20 సంవత్సరాల నుంచి ఆమె పెన్షన్ ఆధారంగా బ్రతుకుతోంది.. ఇకపోతే ఇటీవల ఈమె పెన్షన్ ను కూడా  తొలగించడం జరిగింది . అయితే ఎందుకు టెన్షన్ తొలగించారని అధికారులను ఆమె సంప్రదించగా, అక్కడ అధికారులు చెప్పిన మాటలు విని నివ్వెరపోయింది ఆ బామ్మ.
ఎందుకంటే ఆధార్ కార్డ్ లో ఆమె వయసు 16 సంవత్సరాలు చూపిస్తోందని , అందుకే ఆధార్ కార్డు లో వయసు లేని కారణంగా తనకు పెన్షన్ తీసేశారని అధికారులు చెప్పారు. ఆరు పదుల వయస్సులో తనకు 16 సంవత్సరాలు ఏంటి అని ఆ బామ్మ లబోదిబోమంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికి, ఏ ఒక్కరు కూడా పట్టించుకోక పోవడంతో ఆమె ఎవరిని ఆశ్రయించాలో తెలియక, చాలా ఇబ్బంది పడుతోంది. పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న ఈ బామ్మకు దాన్ని కూడా రాకుండా చేస్తే ఆమె ఎలా బతకాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది..
ఆధార్ కార్డు లో వయసు మార్పించు కోమని ఇటీవల కొంతమంది అధికారులు చెప్పారట. ఇక ఎక్కడికీ వెళ్లలేని ఆ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరిగి తనకు పెన్షన్ ఎలా తెప్పించుకోవాలో తెలియక సతమతమవుతోంది. ఉన్నతాధికారులు ఆమెను చూసి అయినా ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: