వైరల్ : కనీస మద్దతు ధర పెంచుతూ రైతులకు శుభవార్త తెలిపిన మోడీ..
రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్. ఎమ్.ఎస్) కి గాను కనీసం మద్దతు ధరలను (ఎమ్. ఎస్.పీ ) పెంచాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రైతులు తమ పండించిన ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం కోసం, గత సంవత్సరం కంటే ఈ సారి అత్యధిక మద్దతు ధరలను పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాప్సీడ్స్ అలాగే ఆవాల పైన ప్రతి క్వింటాల్ కు రూ.400, పప్పు దినుసుల పై క్వింటాల్ కు రూ.130, కుసుమ గత సంవత్సరం ధర తో పోలిస్తే ఈ సంవత్సరం క్వింటాల్ కు. రూ.114 పెంచుతూ ప్రభుత్వం ప్రకటించింది.
వివిధ రకాల పంటలను ప్రోత్సహించడం కోసమే డిఫరెన్షియల్ రెమ్యునరేషన్ ఇస్తూ అధికారిక ప్రకటన ఇచ్చింది మోడీ ప్రభుత్వం. పోయిన సంవత్సరం ధరల తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1.5 రేట్లు ఎక్కువగా మద్దతు ధరను ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2018 - 2019 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు, వచ్చే సంవత్సరం ధరలు పెంచే విధంగా అందులో ప్రకటన ఉన్నట్లు మోడీ ప్రభుత్వం తెలియజేసింది.
గోధుమలు, బార్లీ, కుసుమ వీటన్నింటిపై అత్యధికంగా ధరలను పెంచినట్లు తెలపడం గమనార్హం. ప్రతి రైతుకు కూడా తాము పండించిన ఉత్పత్తులపై అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ప్రభుత్వం చెప్పడంతో రైతులు కొంత వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.