వైరల్ : ఏపీ ప్రభుత్వం పై చేసిన ఇతగాడి వ్యాఖ్యలు వినండబ్బా..!

Divya
సెప్టెంబర్ 10 వ తేదీన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలను నిలిపివేయబడినవి విషయం తెలిసిందే . ఇకపోతే ఈ విషయాలను ప్రజలు తిప్పికొడుతున్నా,  ప్రభుత్వం మాత్రం  ఏ మాత్రం తనకు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తోంది. కుల, మత అనే భేదాలు లేకుండా అంగరంగ వైభవంగా జరుపుకునే ఒకే ఒక్క  పండుగ గణేషుడి మహోత్సవం. అలాంటి ఈ పండుగను జరుపుకోవడానికి  ప్రభుత్వం అడ్డుపడుతోంది అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల గణేశుడి ఉత్సవాలు జరపాలంటూ  ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఒకతను డైరెక్టుగా మైకు పట్టి మరీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఇతను చేసిన వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం...
హలో హలో వినాయకుడి బొమ్మ పెట్టకూడదంట. హలో వినాయకుడి ఊరేగింపు చేసుకుంటే కరోన వస్తుందట. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.. సినిమా థియేటర్లకు గుంపులుగుంపులుగా వెళ్లి సినిమాలు చూడొచ్చట. అప్పుడు కరోనా రాదట.. ఇదేందబ్బా.. ఇక వినాయకుడి బొమ్మ పెడితేనే కరోనా వస్తుందంట. వైన్ షాపులకు గుంపులుగుంపులుగా వెళ్లి మందు తెచ్చుకోవచ్చట..అప్పుడు కరోనా రాదట. వినాయకుడి బొమ్మ పెడితేనే కరోనా  వస్తుందట.
బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒకరిమీద ఒకరు కూర్చుని ప్రయాణించ వచ్చట. అప్పుడు రాని కరోనా వినాయకుడు పూజ చేసుకుంటేనే కరోనా వస్తుందట. సందుల్లో, బజార్లో పట్టకుండా జనాలు గుంపులుగుంపులుగా తిరగినప్పుడు . రాని కరోనా వినాయకుడు పూజ చేస్తేనే వస్తుందట భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వినాయకుడు పూజ చేసుకుంటే కరోన రాదట. కేవలం ఆంధ్రప్రదేశ్ లో వినాయకుడు పూజ చేసుకుంటేనే వస్తుందట. వినాయకుడు పూజ చేసుకొని విగ్రహం నిమజ్జనం చేస్తే తప్పకుండా కరోనా వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెబుతోంది.. ఎవరైతే కరోనా వస్తుందని వినాయకుడి పూజను అడ్డుకుంటున్నారో వారికి ఖచ్చితంగా కరోనా వస్తుంది అంటూ ఆయన  చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక ఇవన్నీ రాజంపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన కోకిల మురళి అనే వ్యక్తి బైకులో మైకు పెట్టుకొని మరి ఈ విషయాలను చెబుతున్నాడు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: