వైరల్ : పెళ్లి దుస్తుల్లో వరుడు పుష్ అప్స్.. పోటీ పడిన భార్య?

praveen
పెళ్ళంటే నూరేళ్ళ పంట.. వందేళ్లు విడదీయరాని అనుబంధం..  ఒంటరి జీవితానికి ఒక తోడు నీడనిచ్చే ఒక శుభ సందర్భం.  అందుకే నేటి రోజుల్లో పెళ్లి అంటే ప్రతి ఒక్కరు ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు   ఎంత ప్రత్యేకంగా అంటే ఇక మిగతా వాళ్ల తో పోల్చి చూస్తే తమ పెళ్లి మరింత అంగరంగ వైభవంగా కాస్త కొత్తగా కూడా జరగాలని అందరిని ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని పెళ్లిళ్లలో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లు సహా మరికొన్ని రకాల సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ పెళ్లి లో కూడా వధూవరులు కొత్తగా ట్రై చేశారు.

 ఎంత కొత్తగా అంటే ఇప్పటి వరకు ఏ పెళ్లిలో కూడా వధూవరులు ఇలాంటిది ట్రై చేయలేదు అని చెప్పాలి. ఏకంగా పెళ్లి దుస్తుల్లోనే వరుడు స్టేజ్ పైనే పుష్ అప్స్ చేయడం మొదలు పెట్టాడు.  ఇక పక్కనే పెళ్లి దుస్తుల్లో బాగా అలంకరించుకొని ఉన్న వధువు.. నేను ఏమైనా తక్కువ అనుకుందో ఏమో..  ఇక వరుడు తో పాటు పుష్ అప్స్ చేస్తూ పోటీ పడటం మొదలు పెట్టింది.  అంతా చూస్తున్న అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.  ఇంతకీ భార్య అలా భర్త తో పోటీ పడటానికి కారణం కూడా లేకపోలేదు.

 నూతన వధూవరులు ఇద్దరూ కూడా ఫిట్నెస్ కోచ్ లుగా పని చేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఇక వీరిద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవలే స్టేజ్ పైన ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు నూతన వధూవరులు. ఈ క్రమంలోనే వరుడి మనసులో ఒక ఆలోచన తట్టింది. తమకు ఫిట్నెస్ పై ఉన్న ఇష్టాన్ని వినూత్నంగా చాటి చెప్పాలి అని అనుకున్నాడు. ఇక వివాహ వేదిక పైనే పుష్ అప్స్ చేయడం మొదలు పెట్టగానే వెంటనే భార్య కూడా మొదలు పెట్టింది. ఈ ఘటన  గురుగ్రామ్  లో వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ కు చెందిన అక్షిత ఆరోరా, ఆదిత్య మహాజన్ ఇలా వివాహ వేదిక పై పుష్ అప్స్  చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: