వైరల్: సముద్రంలోనే వేల కిలోమీటర్లు ప్రయాణించిన వైన్ బాటిల్
కానీ దీనిని బాగా పరిశీలించగా అది ఇప్పటి కాలంది కాదని అర్ధం అయిపోయింది. అది చాలా పురాతన కలందని ఆ బామ్మ ఊహించింది. అయితే ఇంట్లో ఉన్న బామ్మ కోడలు మాత్రం దానివైపు తదేకంగా చూస్తూ ఫోటోలు తీస్తూ తన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తూ ఉంది. కానీ ఈ ఫోటోలు చుసిన వాళ్ళు కూడా షాక్ అయి, అసలు లోపల ఏమి ఉంటుందో తెలుసుకువాలని దాన్ని ఓపెన్ చేయమని చెబుతున్నారు. ఇక వారి సలహా మేరకు బామ్మ అమందా ఎంతో ఆశగా బోటిల్ ను తెరిచింది. కానీ ఆశించినంతగా అందులో ఏమీ లేదు సరి కదా వైన్ బాటిల్ లో వైన్ లేకపోవడంతో నిరాశ చెందింది. అయితే అందులో ఒక లెటర్ ను చూశారు.
అది కూడా కొంచెం చిరిగి ఉంది. తీరా లెటర్ లో ఏముందా అని చూడగా "దయచేసి ఈ బాటిల్ మీకు అందినట్లుగా కింది మెయిల్ కు రిప్లై ఇవ్వండి" అని రాసి ఉంది. ఈ విషయాలను అమందా ఒక పత్రికకు తెలిపింది. ఈ లెటర్ ప్రకారం చూస్తే కెనడా దేశంలోని సముద్రంలో వదిలినట్టు వారికి తెలిసిందట. ఈ బాటిల్ ను జాన్ గ్రాహం 2020 లో సముద్రంలో పడేశాడట. ఇలా ఆ బాటిల్ సముద్రంలోనే దాదాపుగా 4,800 కిలోమీటర్లు ప్రయాణించి అమందా వద్దకు చేరింది. చూశారా ఆ వైన్ బాటిల్ వెనుక ఎంత కథ ఉందో. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.