అగ్రరాజ్యాల ఆటలో ఆఫ్ఘన్ ఆడ తల్లులు బలి..?

MOHAN BABU
ఆఫ్ఘనిస్థాన్ లో గని ప్రభుత్వ పతనం.. కాబూల్లో తాలిబన్లు పాగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా  ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న విషయం..  దేశాధ్యక్షుడు గని దేశం వదిలి పారిపోయాడు. ఆఫ్గాన్ సేన కూడా ప్రతిఘటించ లేకపోయాయి. అమెరికన్లు ఇంకా పూర్తిగా కాళీ చేయకముందే  తాలిబన్ల మెరుపు వేగంతో దేశాన్ని ఆక్రమించుకోవడం అందరికీ నివ్వెర పరిచింది. ఆఫ్ఘన్  సైన్యంపై వారు ఎనిమిది వేల 300 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. తాలిబాన్లతో అమెరికా రహస్య  ఒప్పందం ప్రకారమే ఇది సాధ్యపడిందని  అంటున్నారు. మొత్తానికి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించు కున్నారు. వారి అరాచకాలను ఇప్పటికే మొదలు పెట్టారు. తాలిబన్లు తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి  అక్కడి మహిళలు అకుంఠిత  దీక్షతో పోరాడాడు. ఆఫ్ఘనిస్థాన్లో హింసను ప్రేరేపించిన తాలిబన్ల ఐదేళ్ల పాలనలో దేశం నష్టపోయిందని, మరోసారి అలాంటి పీడకల సంభవించకుండా  అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో మహిళలు ముందుకు వచ్చారు. అమెరికన్ సేనలు  ఆఫ్గాన్  విడిచి  వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి  ప్రదర్శన చేశారు.

ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్రాన్ని దేశం కోల్పోవడానికి సిద్ధంగా లేదంటూ  వారు నిరసన వ్యక్తం చేశారు. 2001 అమెరికా దాడి చేసే వరకు తాలిబాన్లు అఫ్ఘాన్లో అధికారంలో ఉన్నారు. ఉక్కు పిడికిలితో వారు మధ్యయుగంనాటి శాసనాలను అమలు చేశారు. షరియా చట్టం ఇది చాలా కఠినంగా అమలు చేశారు. తాలిబన్లు కాబూల్ వంటి నగర పట్టణ ప్రాంతాల్లో శాసనం అమలు జరిగింది. తాలిబన్ల పతనంతో పట్టణాలు నగరాల్లో చాలా మార్పు వచ్చింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం యథాతథంగా ఉంది. ఉద్యోగాలు చేసే మహిళలు తమ హక్కుల  గురించి ఇప్పుడు  ఆందోళన చెందుతున్నారు. తాలిబన్ల శాసనం ప్రకారం  మహిళలు  చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి  వీలు లేదు. ఇప్పుడు ఆఫ్ఘన్ మహిళ లకు పూర్తి రక్షణ ఉంది. తాలిబాన్లు  వచ్చిన తర్వాత  ఇది పూర్తి విరుద్ధంగా అవుతుంది అని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. అఫ్గాన్ పశ్చిమ ప్రాంతంలోని హేరాట్ నగరంలో సేల్స్ ఉమన్ గా పనిచేస్తున్న  సీతారా అగ్రి మీడియాతో మాట్లాడుతూ తాలిబన్లు ప్రజలను చంపకుండా ఉంటే సంతోషిస్తామని అన్నారు.

కానీ తాలిబన్లు తమ పాత పద్ధతిలోనే వ్యవహరిస్తే, ఆడవారిని గడప దాటవద్దు అంటే నేను నా కుటుంబాన్ని పోషించుకొలేను. ఆమె భర్త  తన నుంచి విడాకులు పొందారు. అప్పటి నుంచి  పని చేసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటున్నాను. ఆమె మాదిరిగానే కాబులుకు చెందిన మరో మహిళ కూడా ఇదే విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. తాలిబన్లు అధికారాన్ని చేపడితే తమ హక్కులను కొల్ల కొడతారని, పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ధోరణిలో మార్పు వచ్చినట్టు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలను సెకండ్ సెక్స్ గా చూస్తారని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: