వార్తా పత్రిక.. ఇప్పుడంటే సోషల్ మీడియా యుగం కాబట్టి చాలా మంది వార్తా పత్రికలు చదవడం మరిచిపోయారు. కానీ వార్తా పత్రిక గురించి చెప్పాలంటే ఎన్నో దశాబ్దాలుగా సామాన్య ప్రజల నుంచి డబ్బున్న ప్రజల దాకా పెద్ద వార్తా ప్రస్థానంలా కొనసాగుతుంది.ఇక తెలుగు వార్తా పత్రికలలలో ఎన్నో రకాల దినపత్రికలు, ఇక అలాగే పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో వార్తా పత్రికలు ఎంత గానో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయనే చెప్పాలి. సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిన కాని వార్తా పత్రికల స్థానాన్ని ఏమాత్రం భర్తీ చెయ్యలేవు..నిజంగా వార్తా పత్రిక లేకపోతే మనిషికి పొద్దు పొదనే చెప్పాలి. వార్తా పత్రికని చదవడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. మన ముందు తరం దాకా చూసుకున్నట్లయితే మన పెద్ద వాళ్ళు వార్తా పత్రిక చదవడం ద్వారానే తమ రోజుని ప్రారంభిస్తారు.అలా ఎన్నో వందల సంత్సరాలు వార్తా పత్రిక అనేది జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ వార్తా పత్రిక ఐడియా ఎలా వచ్చింది. మొదట ఎలా ప్రచురించబడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి వార్తాపత్రిక ఎప్పుడు, ఎక్కడ ప్రచురించబడింది? అనే విషయానికి వస్తే దీనికి చాలానే చరిత్ర ఉందండోయ్..క్రీస్తుపూర్వం 59 సంవత్సరంలో రోమ్‌లో ప్రచురించబడిన మొదటి వార్తాపత్రిక ఆక్టా డైర్నా ’. 1605వ సంవత్సరంలో ఆంట్వెర్ప్‌లో ప్రచురించబడిన మొదటి ముద్రిత వారపత్రికను రిలేషన్ అని పిలుస్తారు. జోహన్ కరోలస్ (1575-1634) రిలేషన్ అలెర్ ఫర్నేమెమెన్ ఉండ్ గెడెన్క్వర్డిజెన్ హిస్టోరియన్ (అన్ని విశిష్ట మరియు జ్ఞాపకార్థ వార్తల సేకరణ) యొక్క ప్రచురణకర్త. `రిలేషన్’ ను ప్రపంచ వార్తాపత్రికల సంఘం, అలాగే చాలా మంది రచయితలు ప్రపంచంలోని మొదటి వార్తాపత్రికగా గుర్తించడం జరిగింది.ఇక జర్మన్ సంబంధం అనే వార్తా పత్రిక పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో సామ్రాజ్య స్వేచ్ఛా నగరంగా ఉన్న స్ట్రాస్‌బోర్గ్‌లో జర్మన్ సంబంధం వార్తా పత్రిక ప్రచురించబడింది.