చేపలు కూడా దుమ్మెత్తి పోస్తాయా.. వీడియో వైరల్..
జంతువులలో మాత్రం ప్రేమలు ఎక్కువే.. ఒక కాకి చనిపోతే వాటిని అవి తినవు.. పైగా ప్రేమగా చివరి చూపు చూస్తాయి.. కన్నీరు మున్నీరుగా విలపిస్తాయి.. ఉన్న కాకులకు సందేశాన్ని పంపిస్తాయి..దాంతో అన్నీ కాకులు కలిసి ఖననం చేస్తాయి. కానీ మనుషుల్లాగే జంతువులు కూడా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాయి.. అవును.. మీరు విన్నది అక్షరాల నిజం.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..ఆ వీడియో లో చూపిస్తున్నట్లు రెండు చేపల మధ్య కోపాలు వస్తే ఎలా ఉంటుందో అని ఉంటుంది.
సముద్ర జలాలపై హక్కుల కోసం ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి. .. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో తమిళనాడు, కర్నాటకలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. ఆఖరికి మంచినీటి కొళాయి దగ్గర కుమ్ములాటలు మనందరికీ సుపరిచితమే. రెండు వర్గాల మధ్య క్షణాల్లో మంటలు పుట్టించగల శక్తి నీటి సొంతం. ఆ శక్తి ఎలాంటిదంటే నిత్యం నీటిలో ఉండే చేపలు సైతం గొడవలు పెట్టుకునేంత. రెండు సముద్రపు చేపలు ఒకదానిపై మరొకటి దుమ్ముత్తి పోసుకుంటున్న వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. బయటి ప్రపంచంలో నీరు లేక గొడవలు జరుగుతుంటే నీటిలో ఉండి కూడా చేపలు గొడవలు పడుతుండటం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. మీరు ఒకసారి ఆ వీడియోను చూడండి మీకే తెలుస్తుంది..