వైయస్ కుటుంబానికీ కావాలనే ఇబ్బందులు పెడుతున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ మధ్యకాలంలో వరుసగా పలు వివాదాలతో సతమతమవుతున్నారు. గత కొద్దిరోజులుగా వైఎస్ కుటుంబం పైన కూడా పలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. గడిచిన కొద్ది నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా పలు విధాలుగా కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు విషయంలోకి వెళితే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఉన్నారు అనే కోణంలో సిబిఐ దర్యాప్తు నిర్వహిస్తుండగా మరోపక్క టిడిపి నాయకులు బాబాయ్ ని చంపిన వ్యక్తులు ఎవరో తెలిసి కూడా సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు.
మరొకవైపు వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సిబిఐ ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా గత కొద్ది రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయనను కూడా త్వరలోనే అరెస్టు చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరొకపక్క తెలంగాణలో వైఎస్ షర్మిల కూడా పోలీసుల నుంచి మాన్ హ్యాండిల్స్ ఎదుర్కొంది.  అలాగే ఆమె కూడా ఇప్పుడు జైలు జీవితం గడుపుతోంది. మరొకపక్క వైఎస్ విజయమ్మ కూడా తనను తాకరాని చోట తాకుతున్నారని పోలీసులను చెంప దెబ్బలు కొట్టింది. ఇప్పుడు ఆమె కూడా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం.
ఇక ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో విధమైన చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు.  మరి ఇప్పటివరకు సీఎం జగన్ ఇంకా తన బాబాయి హత్య కేసు పైనే ఫోకస్ పెడుతున్నారు. కానీ మరొకవైపు చెల్లి, తల్లి పై జరుగుతున్న ఘోరాల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. అయినా ఉన్నట్టుండి ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా వైయస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. మరొకవైపు ఇది చూసిన వారంతా వైయస్ జగన్ పాలన చరిత్రలో నిలిచిపోతుంది.  ఆయన పాలనను చూసి కుళ్లుకున్న కొంతమంది వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: