వైరల్ : రాటిల్ స్నేక్ ను.. అమాంతం మింగేసిన కాటన్ మౌత్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా వెంటనే తెలుసుకోగలుగుతున్నారు అందరూ. ఈ క్రమంలోనే ఇక ఇటీవల కాలంలో అయితే పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే నేరుగా పాములను చూడడానికి భయపడే ఎంతోమంది అసలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలలో  పాములను చూడడానికి మాత్రం ఎత్తగా ఆసక్తి చూపుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఎవరికి తెలియని ఎన్నో అరుదైన జాతులకు సంబంధించిన పాముల వీడియోలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా పాములు కీటకాలను తిని జీవిస్తూ ఉంటాయి. కానీ కొన్ని భారీ పాములు మాత్రం వాటికంటే చిన్న సైజు ఉన్న పాములను అమాంతం మింగేస్తూ ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. కాటన్ మౌత్ స్నేక్ గురించి దాదాపు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు.

 ఇక ఇవి నేలపై ఎంతో వేగంగా కదులుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక నీటిలో కూడా దూసుకుపోతూ ఉంటాయి. అంతేకాదు నీటిలో ఎక్కువ సమయం గడిపే ఏకైక విషపూరితమైన పాము ఇదే కావడం గమనార్కం. అయితే ఈ పాము తనకంటే చిన్నవైన ఎన్నో విషపూరితమైన పాములను కూడా అమాంతం మింగేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ముదురు, గోధుమ, నలుపు, ఆలివ్,  బ్రాండెడ్, బ్రౌన్ లేదా పసుపు రంగులో ఉంటాయి. అయితే ఇటీవల ఏకంగా ఒక కాటన్ మౌత్ పాము ఒక రాటిల్ స్నేక్ పై దాడి చేసి అమాంతం మింగేసిన వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసి ఈ నెటిజెన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. ఇక కాటన్ మౌత్ పామును మొదటిసారి చూసినవారు అయితే మరింత ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: