అయ్యో పాపం.. కస్టమర్ కు షాక్ ఇచ్చిన జొమాటో..

Satvika
ఇంట్లో వండుకొని తినడం కన్నా చాలా మంది బయట తిండికి బాగా అలవాటు పడ్డారు..కొన్ని సార్లు సమయం లేక రెస్టారెంట్ కు వెళ్లలేని వాళ్ళు ఆన్లైన్ లోనే ఫుడ్ ను ఆర్డర్ చేస్తున్నారు.. ఇలాంటి వాళ్ళ కోసం ఎన్నో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు రోజుకోకటి పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా జొమాటో, స్విగ్గి లు బాగా ఫెమస్..అయితే ఆర్డర్ లు మంచిగా చేస్తున్నా కూడా కొన్ని సార్లు కస్తమర్లకు షాక్ లు తగులుతున్నాయి..మొన్నీ మధ్య చికెన్ లో ప్లాస్టిక్ రబ్బరు వచ్చిన సంగతి పూర్తిగా మరువక ముందే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 
ఓ వ్యక్తి ఆశగా బయట ఉన్న కాఫీ షాప్ ల నుంచి ఆర్డర్ చేసాడు.. దానిని మొదట తన భార్యకు ఇచ్చాడు. ఆమె మొదట కొద్దిగా తాగగానే నోటి లోకి గట్టిగా ఎదో వచ్చింది. అది బయటకు ఊసి చూస్తె ఒక చికెన్ ముక్క.. శాహాకారులు అయిన వాళ్ళు చికెన్ ను చూసి షాక్ అయ్యారు..దాని పై పిర్యాధు చేశారు. అనంతరం ఫోటోలను తీసి సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.అది కాస్త వైరల్ కావడం తో అందరు కామెంట్లు పెడుతున్నారు.

 
వివరాలిలా..ఆర్డర్ చేసిన వంటకాల్లో ఏదో ఒకటి బల్లి, కీటకాలు ఇలా ఏదొకటి ప్రత్యక్షమవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనుభవమే ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఎదురైంది. అతడు ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క వచ్చింది. ఆ విషయం గుర్తించని ఆ వ్యక్తి, ఆయన భార్య కాఫీని తాగేశారు. చివరిలో కాఫీ కప్పులో చికెన్ ముక్క ఉండటం చూసి వారిద్దరూ షాకయ్యారు. వెంటనే తనకు ఎదురైన అనుభవాన్ని తెలియజేస్తూ సుమిత్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నుంచి కాఫీని జొమాటో ద్వారా ఆర్డర్ చేశాడు. శాకాహారి అయిన అతని భార్య కాఫీ రుచి చూశాక అందులో చిన్న చికెన్ ముక్క కనిపించింది. కాఫీ కప్పు మూతపై ఉన్న ముక్కతో ఉన్న ఫొటోను సుమిత్ పోస్ట్ చేశాడు...కాస్త కోపంగానె తిట్టాడు.. మొత్తానికి ఇక జన్మలో ఆర్డర్ చెయ్యను నాకు బుద్ది వచ్చింది అంటూ ఫైర్ అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: