బుల్లి పిట్ట: ఆన్లైన్లో మొబైల్ కొంటున్నారా..కొత్తదా కాదా ఇలా చెక్ చేయండి..?

Divya
పండుగ సీజన్లు వచ్చాయంటే చాలు.. చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలక్ట్రిక్ వస్తువులను మొబైల్స్ని కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తక్కువ ఆఫర్లకే ఆకర్షణయమైనా మొబైల్స్ని ఈ కామర్ సంస్థల ఫ్లాట్ ఫామ్ లో మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. అయితే అలా స్మార్ట్ మొబైల్ ని కొనుగోలు చేసినప్పుడు కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్, డ్యామేజ్ స్మార్ట్ ఫోన్లు ఇతరులు వాడిన మొబైల్స్ సైతం వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి మొబైల్స్ మనము తీసుకుంటున్నామా  లేదా అనే విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చు.

ఇటీవలే ఒక యూజర్ ఫ్లిప్కార్ట్ నుంచి స్మార్ట్ మొబైల్ ని తీసుకున్నప్పుడు.. డెలివరీ అయిన తరువాత మొబైల్ కు స్క్రాచ్ అయినట్లుగా యూజర్ గుర్తించారు. అది ఎలా అంటే బాక్స్ మీద ఉండే నెంబర్లను ఎంటర్ చేసి కనుక్కున్నారట. సాధారణంగా ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఆర్డర్ చేశామంటే చాలు డెలివరీ బాయ్ కి ఓటీపీని షేర్ చేస్తూ ఉంటాము. కానీ ఈ యూజర్ ఓటిపి షేర్ చేయకుండా ఆ మొబైల్ ని రిటర్న్ ఇచ్చేసారట.. అయితే మనం బాక్స్ ఓపెన్ చేయకుండానే మొబైల్ కొత్తది కొన్నామా సెకండ్ హ్యాండిల్ కొన్నామా లేకపోతే ఎలా అనేది స్మార్ట్ మొబైల్ వారంటీ ద్వారా చెక్ చేసుకోవచ్చట.

ముందుగా మనం గూగుల్ సెర్చింగ్ లోకి వెళ్లి స్మార్ట్ మొబైల్ వారంటీ స్టేటస్ కోసం చూడాల్సి ఉంటుంది.. ఉదాహరణకు మీ మొబైల్ oppo warranty checke అనే వాటిని సెర్చ్ చేయాలి.
ఆ తర్వాత లింకు పైన క్లిక్ చేసి మీ స్మార్ట్ మొబైల్ సిరీస్ నెంబర్ ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది.

ఒకవేళ మీరు కొత్త మొబైల్ తీసుకున్నట్లయితే రిటైల్ బాక్స్ మీద ఓపెన్ చేసి ఉన్న నెంబర్ ని ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ప్రతి కంపెనీ కూడా బాక్స్ లేబుల్ పైన స్మార్ట్ మొబైల్ నెంబర్ ని కచ్చితంగా అందిస్తూ ఉంటుంది.


అలా వారంటీ నెంబర్లను ఎంటర్ చేసిన తర్వాత వారంటీ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం కొత్త మొబైల్ లేదా , సెకండ్ హ్యాండిల్ మొబైల్ తీసుకున్నామ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: