బుల్లి పిట్ట: అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతున్న కొత్త ఐఫోన్..!!

Divya
గడిచిన రెండేళ్ల క్రితం నుంచి ఐఫోన్లో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఏమీ కనిపించలేదు.. ఆపిల్ ఐఫోన్లు డిజైన్ మార్పులు మాత్రమే జరుగుతూ ఉండేవి సాఫ్ట్వేర్లు ఎక్కడా కూడా పెద్దగా మార్పులు అనేవి కనిపించలేదు. కానీ ఈ మధ్యనే శాంసంగ్ S-24 తో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ ఈ మొబైల్లో మొదటిసారి తీసుకురావడం జరిగింది.. లైవ్ ట్రాన్సిషన్..AI అసిస్టెంట్ ఇలా సరికొత్త ఫీచర్స్ ని పరిచయం చేసింది.. ఇప్పుడు యాపిల్ కూడా వచ్చే ఐ ఓ ఎస్..18 లో ఈ సరికొత్త ఫీచర్స్ ని తీసుకురాబోతోందట..

వీటితో పాటు పూర్తి స్థాయిలో ఆపిల్ ఇంటర్ స్పేస్ ను కూడా మార్చబోతోందట.. గతంలో ఐఫోన్ యూజర్స్ కి ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్ ని ఈ కొత్త అప్డేట్ తో తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.. మెయిల్, నోట్స్ నుంచి యాప్స్ ఐకాన్ వరకు అన్నీ కూడా మార్చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా యాపిల్ యాప్స్ కు.. google యాప్స్ తో పెద్దగా పోలిస్తే ఆదరణ లేదని కూడా చెప్పవచ్చు. వీటిని అధిగమించడానికి యాపిల్ కూడా యాప్స్ లో చాలా మార్పులు తీసుకురాబోతోందట.

పర్సనల్ రూట్స్ ,నావిగేషన్, ఫ్లెక్సీబుల్ వంటి కొత్త ఆప్షన్లతో ఆపిల్ రాబోతోంది.. మొదటిసారి ఆపిల్ కొత్త హోమ్ స్క్రీన్ ను కూడా తీసుకురాబోతోందట. అలాగే యూజర్స్ ఫ్రెండ్లీ హోం స్క్రీన్ ని కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ ఐవోఎస్18 తో ఐఫోన్ యొక్క రూపురేఖలే మారబోతున్నాయట..RCS తో ఆటోమేటిక్ రిప్లై కూడా ఇవ్వచ్చు అన్నట్లుగా తెలుస్తోంది.. అలాగే మెయిల్ కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ సదుపాయంతో రిప్లై ఇచ్చే విధంగా తీసుకురాబోతున్నారట.. అలాగే మనం చదివిన తర్వాత రిప్లై అని టైప్ చేస్తే చాలు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెండ్ చేస్తుందట.. అయితే ఐఓఎస్ 18 అన్ని మొబైల్స్ లో కూడా ఈ అప్డేట్ అవ్వదట కేవలం 23 మోడల్స్ లో మాత్రమే ఈ అప్డేట్ చేయబోతున్నారు..

ఐఫోన్ ఐఓఎస్18 అప్డేట్ మోడల్స్..
1). ఐఫోన్-11
2) ఐఫోన్-11pro
3). ఐఫోన్-11 pro max
4). ఐఫోన్-12 mini
5).ఐఫోన్-12
6).ఐఫోన్-12 pro
7).ఐఫోన్-12 pro max
8).ఐఫోన్-13..13,pro..13 Pro max
9).ఐఫోన్-14..14pro..14 pro Max
10).ఐఫోన్-15..15pro..15 pro Max
11).ఐఫోన్ SE (3RD GEN)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: