బుల్లి పిట్ట: వాట్సాప్ లో ఈ ఫీచర్స్ మహిళల భద్రత కోసమని తెలుసా..?
అయితే ఆ ఫీచర్స్ ఏమిటంటే.. ముఖ్యంగా మీ ప్రొఫైల్ ఫోటో నుంచి లాస్ట్ సీన్ డేటా వరకు ప్రతిదీ ఆన్లైన్ పరిస్థితి ఆన్లైన్ సమాచారానికి యాక్సెస్ చేసుకునే వారిని ఎంచుకోవచ్చు.. ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ లో ఉండే వారిని మాత్రమే ఎంచుకోవాలని చెబుతూ ఉంటారు.ఇలా చేయడం ద్వారా మీ డిజిటల్ ఉనికి నియంత్రించడానికి మీకు అధికారం ఇస్తుంది.
వాట్సప్ అనేది వ్యక్తుల ఇష్టంతోనే కమ్యూనిటీ చేయడానికి ఒక ప్రైవేటు చాట్ లాంటిది.. ఇది చాలా సురక్షితమైన యాప్. అంతేకాకుండా మనకు తెలియని నెంబర్లను కూడా ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరు కాల్స్ చేయలేరు మెసేజ్లను కూడా పంపలేరు..
వాట్సాప్ లో మనం రెండు దశాల ధ్రువీకరణను ఎంచుకోవడం వల్ల మన ఖాతాకు అదనపు భద్రత జోడించవచ్చు.. అదేమిటంటే వాట్సప్ ఓటీపీ 6 అంకెల నెంబర్ ని ధ్రువీకరించడానికి ఎంట్రి చేయడం.. మరొకటి వాట్సాప్ కాల్ ద్వారా ధ్రువీకరించడం.
ముఖ్యంగా మనం ఏదైనా చాట్ ను ఒకరోజు ఏడు రోజులు 90 రోజులు వంటి ఆప్షన్లతో అదృశ్యమయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ చాట్ డేటా ను తొలగించే చేసుకోవచ్చు.
మనం ఏదైనా సమాచారాన్ని సేఫ్ గా ఉంచాలంటే పాస్వర్డ్ తో వీటిని లాక్ చేసుకోవచ్చు.వీటికి ప్రత్యేకమైన ఫోల్డర్ ను కూడా ఉన్నది.. మీ చాట్ లాక్ చేసినప్పుడు మీ ఫోన్ ఎవరి వద్ద ఉన్నప్పటికీ వాటిని ఎవరు చదవలేరు.