బుల్లి పిట్ట:శాంసంగ్ యూజర్స్ ని హెచ్చరిస్తున్న కేంద్రం.. కారణం అదే..!!

Divya
గతంలో ఎక్కువగా శాంసంగ్ మొబైల్స్ ని సైతం చాలామంది వినియోగించేవారు. ముఖ్యంగా కీప్యాడ్ మొబైల్స్ లో ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత కాస్త శాంసంగ్ బ్రాండ్ హవా తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇటీవలే భారత ప్రభుత్వం శాంసంగ్ మొబైల్స్ వినియోగిస్తున్న వారికి కొన్ని హెచ్చరికలను సైతం జారీ చేస్తోంది. ఎందుకంటే అదనపు భద్రత కోసం తమ మొబైల్ లను వెంటనే అప్డేట్ చేయాలంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది వినియోగదారులకు.

ఈ మేరకు ప్రభుత్వం ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది..CERT -IN తెలిపిన సమాచారం ప్రకారం శాంసంగ్ గెలాక్సీ మొబైల్ ని  వినియోగిస్తున్న వినియోగదారులు భద్రతా లోపాలను ఉన్నట్లుగా గుర్తించారట.. డిసెంబర్ 13వ తేదీన జారీ చేసిన భద్రత హెచ్చరికలో భాగంగా చాలా పెద్ద ప్రమాదం ఉన్నదని తెలియజేయడం జరిగింది..శాంసంగ్ వినియోగదారులు సిస్టం లేదా పర్ఫామెన్స్ ను వెంటనే అప్డేట్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది..CERT -IN తెలిపిన ప్రకారం శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ తో పాటు పాత మొబైల్స్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయని గుర్తించిందట.

దీనివల్ల సైబర్ నేరస్తులు కూడా లక్షలాది మంది ఈ మొబైల్స్ పైన వ్యక్తిగత డేటాను సైతం దొంగలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలియజేస్తున్నారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియాలో ఉపయోగించే ఈ స్మార్ట్ మొబైల్స్ పైన హెచ్చరించడం జరిగింది... ముఖ్యంగా ఆండ్రాయిడ్ వర్షన్ 11,11,13,14 ఆపరేటింగ్ సిస్టంలను సైతం వెంటనే అప్డేట్ చేసుకోవాలంటే హెచ్చరిస్తోంది. వీటిని ఉపయోగించేవారు మాత్రం నిర్లక్ష్యం చేయడం వల్ల సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయే అవకాశం ఉందని దీనివల్ల డేటాను హ్యాక్ చేసే వీలుందని తెలియజేస్తోంది.శాంసంగ్ మొబైల్ ని సైతం వెంటనే అప్డేట్ చేసుకోవాలంటే ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. మరి ఈ విషయం పైన శాంసంగ్ సమస్త ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: