బుల్లి పిట్ట: డిసెంబర్ ఒకటి నుంచి ఆ జిమెయిల్ అకౌంట్లు డిలీట్..!!

Divya
ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జిమెయిల్ అకౌంట్ అనేది ఉండనే ఉంటుంది చాలామంది జిమెయిల్ అకౌంట్ లో క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ అందులో ఒకటో రెండో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.కొన్ని జిమెయిల్ అకౌంట్లను క్రియేట్ చేసిన తర్వాత మరిచిపోతూ వాటిని వదిలేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి జిమెయిల్ అకౌంట్ లో ఇకమీదట పనిచేయవట. ఇవి పర్మినెంట్గా డిలీట్ కాబోతున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజ గూగుల్ జిమెయిల్ అకౌంట్లకు సంబంధించి సరికొత్త పాలసీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే చాలామంది జీమెయిల్ యూజర్స్ కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ యాక్టివ్ ఉన్న జిమెయిల్ అకౌంట్లను సైతం పూర్తిగా తొలగించేందుకు ఒకసారి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు డిసెంబర్ 1 నుంచి ఈ సరికొత్త పాలసీ అమలులోకి రాబోతున్నది. జిమెయిల్ అకౌంట్ లో ఉన్న ఫోటోలు డ్రైవ్ డాక్యుమెంట్లు కాంటాక్ట్ లు వంటివి శాశ్వతంగా తొలగించబోతున్నట్లు తెలియజేశారు. కనీసం రెండు ఎల్ల పాటు ఉపయోగించని లేదా యాక్సిస్ చేయని జిమెయిల్ అకౌంట్ లను వెంటనే తొలగించే విధంగా తగు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జిమెయిల్ అకౌంట్ లో స్కూల్ లేదా వ్యాపారాల వంటి సంస్థలకు లింక్ చేసిన వాటికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది

అయితే ఈ జిమెయిల్ అకౌంట్లను తొలగించడానికి ముందుగా మల్టీ నోటిఫికేషన్లను సైతం పంపిస్తారట. గూగుల్ అందించే సర్వీసులలో ప్రధానంగా గూగుల్ డ్రైవ్ ,డాక్స్, మీట్, క్యాలెండర్ ఫొటోస్ వంటి వాటి పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. యూట్యూబ్ లేదా బ్లాగ్ కంటెంట్ కలిగిన జిమెయిల్ అకౌంట్ లో నుంచి మినహాయింపు ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. అయితే జిమెయిల్ అకౌంట్లను సైతం తొలగించేటప్పుడు వరుసగా నోటిఫికేషన్లతో అప్రమత్తంగా ఉండండి అంటూ తెలుపుతున్నారు గూగుల్ నోటిఫికేషన్ రికవరీ ఈమెయిల్ అడ్రస్సులకు సైతం పంపిస్తారట. దీంతో త్వరలోనే జిమెయిల్ అకౌంట్ లను సైతం డిలీట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: