బుల్లిపిట్ట: గూగుల్ పిక్సెల్ ప్రియులకు శుభవార్త.. సగం ధరకే..!

Divya
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర నిత్యవసరంగా మారిపోయింది. అయితే మార్కెట్లోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీకి కూడా యువత ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే టెక్ కంపెనీలు కూడా విభిన్నమైన టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను ప్రవేశ పెడుతూ యువతను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ కూడా సగం ధరకే లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ సగం ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను  అందించడానికి సిద్ధమయ్యింది.

అదిరిపోయే స్టాండింగ్ కెమెరా ఫోన్ లకు పెట్టింది పేరైన గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 4వ తేదీన గూగుల్ పిక్సెల్ 8 నుండి ఈ స్మార్ట్ ఫోన్లను లాంచింగ్ కు సిద్ధం చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన తర్వాత పాత తరం ఫోన్ల ధరలలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ ముందు ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. మరి ఆఫర్ వివరాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం.

స్టాండింగ్ ఫోటోలను అలాగే గొప్ప వీడియోలను చిత్రీకరించగల గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ ను గూగుల్ రూ.43,999 ధరతో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయబడగా..  ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.25,999 కే లభిస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ .1200 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్ తో కొనేవారు అదనపు ఎక్స్చేంజ్ తగ్గింపును కూడా పొందే వీలు ఉంటుంది.12.2 mp +12 mp డ్యూయల్ రియల్ కెమెరా సిస్టంతో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: