Wifi ని తలదన్నేలా LIFI .. హ్యాకింగ్ బెడద తప్పినట్టే..?
వైఫై బ్రాండ్ రూటర్ వంటివి చిన్నవారి నుంచి పెద్దవారికి తెలిసిన విషయమే బయటకు వెళ్లిన ఇంట్లో ఉన్న ప్రతిక్షణం మన చేతిలో కచ్చితంగా మొబైల్ ఫోన్ ఉండనే ఉంటుంది. అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా క్షణం కూడా గడపలేని పరిస్థితిలో ఉన్నాము బహిరంగ ప్రదేశాలలో మొబైల్ కనెక్టివిటీ ఇళ్లలో వైఫై వంటివి వాటిపైన ఆధారపడుతున్నాము. దీంతో సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోతూ ఉన్నారు సైబర్ నేరగాళ్లు వైఫై ద్వారానే డేటాను చాలా ఈజీగా దొంగలిస్తున్నట్లు ప్రముఖ నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
అందుకే మన డేటాను చాలా రహస్యంగా ఉంచడానికి లైఫై (Lifi) బెటరని చెప్పవచ్చు.. అయితే అసలు ఇది ఏమనుకుంటున్నారా చాలామందికి వైఫై మాత్రమే తెలుసు చాలా తక్కువ మందికి మాత్రమే లైఫై (Lifi) గురించి తెలుసు ఈ నూతన సాంకేతికత్వంతో తయారుచేసిన దీంతో వైఫై కంటే అధిక ప్రయోజనాలు పొందవచ్చట. రేడియో వేవ్స్ తో సమాచారం పంపడం పై వైఫై అయితే కాంతి తరంగాలతో సమాచారాన్ని పంపించడాన్నే లైఫై అంటారు. ఇందుకోసం ఒక ఎల్ఈడి బల్బుతో పాటు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో చిన్న చిన్న మార్పులను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం 800 నుంచి 100 NM గల కాంతి తరంగాలు కావాలి. దీనివల్ల 10 MBPS నుంచి గరిష్టంగా 9.6 జివిపిఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్ ని పొందవచ్చు. వైఫై లో ఎన్ని పాస్వర్డ్ పెట్టుకున్న హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.. లైఫై లో మాత్రం అలాంటి వాటికి అవకాశం ఉండదు.