మిస్సైల్‌ రంగంలో దూసుకుపోతున్న ఇండియా?

భారత రక్షణ పరిశోధక విభాగం డీఆర్డీవో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ప్రస్తుతం హైపర్ సోనిక్ వెఫన్స్ కావాలంటే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండా డీఆర్డీవో ఒక అద్భుతమైన హైపర్ సోనిక్ వెపన్ ను కనిపెట్టింది. సెకన్ కు 2 కిలోమీటర్ల దూరం నిమిషానికి 120 కిలోమీటర్ల దూరంతో పని చేసేలా ప్రయత్నాన్ని మొదలెట్టింది.

ఎక్కువ డబ్బులతో కాకుండా స్వదేశీ శక్తితో దీన్ని తయారు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం కూడా ఒకే చెప్పేసింది. ఇక్కడ తెలుగు ప్రజలు కూడా గర్వపడే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ డీఆర్డీవో హెడ్ గా సతీశ్ రెడ్డి ఉన్నారు.  సతీశ్ రెడ్డి తెలుగు వ్యక్తి కావడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. భారత దేశం డీఆర్డీవో సంస్థ అద్భుతమైన కాన్పెస్ట్ తో దీన్ని తయారు చేస్తున్నారు.

వీటికి ప్రభుత్వం కూడా ఒకే చెప్పేసింది. అయితే హైపర్ సోనిక్ మిస్సైల్ అనేది భారత అమ్ముల పొదిలో విలువైన అస్త్రం. ఎందుకంటే వేగంగా అభివృద్ది చెంది ఆర్థికంగా బలవంతమైన దేశాల్లో ఆ ఆయుధాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం భారత్ కూడాా వాటి సరసన చేరింది.

దేశ వ్యాప్తంగా గతంలో ఆయుధాలను ఎక్కువగా వివిధ దేశాల నుంచి కొనుగోలు చేసుకునేవాళ్లం. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో కొని వాటి కోసం కొన్ని వందల కోట్ల రూపాయలను వెచ్చించే వాళ్లం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.  స్వదేశీ వస్తువుల తయారీ ఎలానో ప్రస్తుతం సొంత నాలెడ్జ్ తోనే మిస్సైల్స్ కూడా తయారు చేసుకుంటున్నాం. ముఖ్యంగా దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైనవి మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు ఆయుధాలు కొనుగోలు చేసే ఇండియా ఇప్పుడు ఆయుధాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఆఫ్రికా దేశాలకు తక్కువ ధరకు అమ్ముతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: