అప్పుడు తమ్ముడు భార్యకు విడాకులు ఇచ్చి దూరమైతే ఇప్పుడు అన్న కూడా తమ్ముడి బాటలోనే రెండో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారట.ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే..డైరెక్టర్ సెల్వ రాఘవన్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ అంటే తెలియని వారు ఉండరు.ఈయన తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కాదల్ కొండేన్ సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన డైరెక్టర్ సెల్వరాఘవన్ మొదట హీరోయిన్ సోనియా అగర్వాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనియా అగర్వాల్ ఇద్దరూ పట్టుమని 10 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేదు.
ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సెల్వరాఘవన్ దర్శకురాలు గీతాంజలిని రెండో పెళ్లి చేసుకున్నారు. అలా వీరి పెళ్లి 2011లో జరిగింది. అయితే పెళ్లయిన 14 ఏళ్లకు ఈ జంట విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విడాకుల వార్తలు ప్రచారంలో ఉండడానికి ప్రధాన కారణం గీతాంజలి తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి సెల్వరాఘవన్ తో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడమే. అయితే చాలామంది సెలబ్రిటీలు తమ బంధం బ్రేక్ అయింది అని అందరికీ అర్థం అవ్వడానికి ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియా అకౌంట్లు అన్ఫాలో చేయడం..
సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు.అలా తాజాగా గీతాంజలి కూడా తన భర్త సెల్వరాఘవన్ తో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో సెల్వరాఘవన్ రెండో భార్యకి కూడా విడాకులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక 2024 లో ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చారు.ప్రస్తుతం ధనుష్ ఐశ్వర్య ఇద్దరు సింగిల్గానే ఉంటున్నారు.కానీ ధనుష్ పలువురు హీరోయిన్లను పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నప్పటికీ అందులో ఏది నిజం కాలేదు.