బాలయ్య అఖండ 2 : శివుడు ఎవరు.. ?
ఈ సీన్ సినిమాకు పెద్ద సర్ప్రైజ్‌గా నిలిచింది. థియేటర్‌లో ఆ సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్షకులు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోవడం, భావోద్వేగానికి లోనవడం స్పష్టంగా కనిపించింది. ఆ సన్నివేశంలో శివుడి పాత్రలో కనిపించిన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అతని హావభావాలు, గంభీరత, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాయి. అంతేకాదు, క్లైమాక్స్‌లో కూడా మరోసారి శివుడు దర్శనమివ్వడం సినిమాకు మరింత ఆధ్యాత్మిక టచ్‌ను తీసుకొచ్చింది.
ఇంతకీ శివుడి పాత్ర చేసిన నటుడు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘అఖండ 2’కి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉత్తరాది నటులను కీలక పాత్రల్లో ఎంపిక చేశారు. శివుడి పాత్రను పోషించింది హిందీ నటుడు తరుణ్ ఖాన్. ఆయన హిందీ టెలివిజన్ సీరియళ్లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ముఖ్యంగా 2015లో ప్రసారమైన ‘సంతోషి మా’ సీరియల్‌లో కూడా మహా శివుడి పాత్రనే పోషించడం విశేషం. అంతేకాదు, మరికొన్ని సీరియళ్లలోనూ ఆయన శివుడి వేషంలో కనిపించారు. ఈ బ్యాక్‌గ్రౌండ్ కారణంగానే దర్శకుడు బోయపాటి ‘అఖండ 2’ కోసం తరుణ్ ఖన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా శివుడి పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని, పాత్రకు పూర్తి న్యాయం చేశాడని ప్రేక్షకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, బాక్సాఫీస్ వసూళ్లతో పాటు ఈ శివుడి సీన్ ‘అఖండ 2’కి ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది.