కరోనాపై చైనా కుట్ర బయటపెట్టిన సొంత సైంటిస్ట్?
అక్కడ బయో వార్ సృష్టించాలని చైనా చేసిన పన్నాగమే దీనికి కారణమని ఇప్పటికే కొంత మంది చైనా సైంటిస్టులతో పాటు అమెరికా చెప్పింది. కానీ చైనా అధికార యంత్రాంగం దీన్ని కొట్టి పారేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వుహన్ ల్యాబ్ లో టెస్టులు చేస్తామని చెబితే మాత్రం దానికి డ్రాగన్ కంట్రీ నిరాకరిస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రపంచ దేశాలకు అనుమాలను మరింత పెరిగిపోయాయి.
ప్రపంచాన్ని శాసించాలని చైనా చేసిన కుట్ర అని బహిర్గతమైంది. అయితే చైనాలోనే వావో షాడో అనే శాస్త్రవేత్త సరికొత్త సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ పుట్టుక ఏమిటి? దాన్ని మనుషులకు ఎలా సోకేలా చేశారు. అనే దానిపై వివరాలు బయట పెట్టాడు. కరోనా వైరస్ ను వుహన్ ల్యాబ్ లో తయారు చేశారు. ఇది బయో వెపన్ మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి కరోనా వైరస్ లను నాలుగింటిని వుహన్ ల్యాబ్ లో తయారు చేస్తున్నారు.
అందులో ఒక దాన్ని 2019 మిలిటరీ వరల్డ్ గేమ్స్ సందర్భంగా దీన్ని ఆటగాళ్ల రూమ్స్ లో ప్రవేశపెట్టారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అయినప్పటికీ దాన్ని బయట ప్రయోగించారు. దీంతో ప్రపంచం మొత్తం కరోనాతో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిన విషయమే. కరోనా లాంటి బయో వెపన్ లను తయారు చేస్తున్న చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కట్టడి చేయలేకపోవడం చాలా దారుణమని సైంటిస్టులు చెబుతున్నారు.