వాట్సాప్: లేటెస్ట్ అప్డేట్.. మరో కొత్త ఫీచర్?

ఇక మరో లేటెస్ట్‌ అప్‌డేట్‌ ను వాట్సాప్‌ వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. వినియోగదారులను అభిప్రాయాలను అడగడానికి ఇంకా ఫీడ్‌బ్యాక్‌ సేకరించడానికి తీసుకొచ్చిన పోలింగ్‌ ఫీచర్‌కి ఓ మరో కొత్త ఫీచర్లు యాడ్ చేసి వాట్సాప్ అప్‌డేట్‌ అందించింది. ఇంకా అదే విధంగా మెసేజ్‌లు, డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో ఫార్వాడ్‌ చేసే ఫెసిలిటీ కూడా తీసుకొచ్చింది.వాట్సాప్‌ 2022 నవంబర్‌ నెలలోనే పోలింగ్ ఫీచర్‌ని లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఈ ఫీచర్‌కి లేటెస్ట్‌ అప్‌డేట్‌లను కూడా తీసుకొచ్చింది. ఏదైనా అంశంపై ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్‌ పోల్స్‌ ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇక కొత్తగా ఇందులో మూడు అప్‌ డేట్‌ లను తీసుకొచ్చింది.ప్రస్తుతం వాట్సాప్‌ పోల్స్‌ లో వినియోగదారులు ఒకటి కన్నా ఎక్కువసార్లు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేయవచ్చు.దీని వల్ల పోల్స్‌ ఫలితాల్లో సరైన పారదర్శకత ఉండటం లేదని చాలా మంది యూజర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనికి పరిష్కారంగానే వాట్సాప్‌ క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్‌ ఆప్షన్‌ ని తీసుకొచ్చింది.


దీంతో పోల్‌ లో పాల్గొనే వారు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.అలాగే ఏదైనా గ్రూప్‌ లో పోల్‌ నిర్వహించిన తర్వాత ఓటు వేద్దామని మర్చిపోతాం. ఆ తర్వాత గ్రూప్‌ లో వచ్చిన మెసేజ్‌లతో పోల్‌ ఎక్కడ ఉందనేది కనిపించదు. ఇలాంటి సందర్భంలో పోల్‌ను సులువుగా గుర్తించేందుకు చాట్‌ పేజీలో మీరు సెర్చ్‌ చేయచ్చు. గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ పేజీలో సెర్చ్‌ ఆప్షనలోకి వెళ్లి పోల్‌స్‌ అని టైప్‌ చేస్తే మొత్తం పోల్స్‌ లిస్ట్ చూపిస్తుంది.ఇక పోల్‌ రిజల్ట్‌ అప్‌డేట్‌ ఫీచర్‌తో యూజర్లు తాము నిర్వహించే పోల్స్‌లో ఎవరైనా ఓటు వేసిన వెంటనే నోటిఫికేషన్‌ ఈజీగా వస్తుంది. దీనివల్ల ఎప్పుడు? ఎవరెవరు ఓటు వేశారనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు.యూజర్లు చాలా సులభంగా ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేయడానికి, కమ్యూనికేట్‌ కావడానికి వీలుగా వాట్సాప్‌ కొత్త ఫీచర్లను తీసుకురావడం జరిగింది. ఫొటోలు, వీడియోలు ఇంకా డాక్యుమెంట్లను క్యాప్షన్‌లతో ఫార్వార్డ్ చేసే అవకాశం కల్పించింది. కాంటాక్ట్స్‌తో మీడియాను షేర్‌ చేసేటప్పుడు ఈ ఫీచర్ మరింత వివరణని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: