బుల్లిపిట్ట: రూ.50 వేల స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే.. ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.!
ఇకపోతే రిలీజ్ ధర రూ.49,999 కాగా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో రూ.29,999 ధరకే లిస్ట్ చేయబడి వుంది. అంటే ఏకంగా ఈ స్మార్ట్ ఫోన్ పైన మీరు 20 వేల డిస్కౌంట్ను పొందవచ్చు ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్ లభించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మనకు కాస్మో బ్లూ, స్టార్ డస్ట్ వైట్ కలర్స్ లో లభ్యం అవుతుంది. ఇందులో క్వాల్ కం కి చెందిన పవర్ఫుల్ చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ వన్ కూడా ఉంది. అలాగే ఐ క్యు 9 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్లో కూడా ఇదే తరహా ప్రాసెసర్ ఉండడం విశేషం.
144 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో 6.7 అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లేను కూడా కలిగి ఉంది. అలాగే ముందువైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, వెనుక వైపు త్రీ డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటేక్షన్ కూడా అమర్చబడి ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. ఇక కెమెరా 50 మెగాపిక్సల్ ప్రైమరీ, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ తో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా అలాగే సెల్ఫీ కోసం 60 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉండడం విశేషం.