ఓ కంపెనీకి సీఈఓ.. కానీ జీతం 15 వేలే?

praveen
ఇటీవల కాలంలో మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు ఏ రేంజ్ లో ఉంటున్నాయి అన్న విషయం గురించి అందరికీ తెలుసు. ఒక సాదాసీదా  ఎంప్లాయ్ జీతమే ఊహకందని రీతిలో ఉంటుంది. అలాంటిది ఏకంగా ఒక కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్న వ్యక్తి కోట్లల్లోనే సంపాదిస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎన్నో కంపెనీలకు సీఈవోగా పనిచేస్తున్నవారు భారీగా వేతనం అందుకుంటూ ఉండడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే ఇలా ఒక కంపెనీకి ఎవరైనా సీఈవోగా పనిచేస్తున్నాడు అంటే అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కూడా వారి జీవితం ఎక్కువగానే ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఒక కంపెనీకి సీఈఓ గా ఉండి కూడా అతని తీసుకుంటున్న జీతం హాట్ టాపిక్ లో మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ఫిన్ టేక్  కంపెనీ క్రెడిట్ సీఈవో కునాల్ షా తన జీతం గురించి వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీ థింగ్ స్టేషన్లో భాగంగా ఆయన జీతం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పుకుచ్చాడు.

 క్రేడ్ సీఈవోగా తాను నెలకు పదిహేను వేల జీతం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. క్రెడిట్ కంపెనీలో మీ జీతం చాలా తక్కువగా ఉంది ఇలా వచ్చిన డబ్బుతో ఎలా జీవిస్తున్నారు అని ఒక నేటిజన్ ప్రశ్నించాడు. అయితే ఈ సంస్థ లాభదాయకంగా మారేవరకు కూడా నేను ఇంతకంటే మంచి జీతం తీసుకుంటానని అనుకోవడం లేదు అంటూ కునాల్ షా సమాధానం చెప్పాడు. గతంలో నేను ఫ్రీఛార్జ్ సంస్థను విక్రయించాను. అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అతను  చేసిన వ్యాఖ్యలను స్క్రీన్ షాట్ తీస్తున్న నేటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ceo

సంబంధిత వార్తలు: