బుల్లి పిట్ట: మొబైల్ లో వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!

Divya
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ను ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వాడుతూనే ఉన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంటుంది. ఇక ఇందులో పలు రకాల యాప్స్, గేమ్స్ వంటివి మనం ఉపయోగిస్తూనే ఉంటాము. అయితే ఇలాంటి సమయంలోనే మన ఫోన్లకు భద్రత అనేది చాలా అవసరం. స్మార్ట్ఫోన్లలో ఇష్టానుసారంగా యాప్స్ ఉపయోగించుకుంటే మన మొబైల్ కి వైరస్ సోకే ప్రమాదం చాలా ఉంటుంది. ఇలా స్మార్ట్ ఫోన్ లో నే కాకుండా కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటి వాటిలో కూడా వైరస్ చేరి వాటిని ఖరాబ్ చేస్తూ ఉంటాయి. అయితే కొన్ని పద్ధతుల ద్వారా ఇలాంటి వైరస్ ను మనం నివారించవచ్చు వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
కొంతమంది టెక్నీషియన్స్ తెలిపిన ప్రకారం.. మనం ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసే ముందు కొన్ని విషయాలను పరిశీలించాలట. యాప్స్ కు 5 స్టార్ రేటింగ్ ఉండవలసిన అవసరం వుంటుంది . మనం యాప్ ను  ఇన్స్టాల్ చేసేటప్పుడు.. అందుకు సంబంధించిన అనుమతులను అడుగుతుందో లేదు గుర్తించాలి. కొన్ని యాప్స్ ఫేక్ ఆప్స్ గా సృష్టించబడుతూ ఉంటాయి. ఇలాంటి యాప్స్ మన మొబైల్లో పదేపదే క్రాష్ అవుతూనే ఉంటాయి.
కొంతమంది మన స్నేహితుల నుంచి వచ్చిన లింక్ ద్వారా కూడా యాప్స్ ను డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది apk ఫైల్స్ లను కూడా డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి చాలా చిక్కులు తెస్తాయి అని తెలియజేశారు. ఇలాంటివి కంప్యూటర్ , లాప్టాప్ లో ఉపయోగించడం వల్ల వైరస్ వస్తుందని నిపుణులు తెలిపారు. మన మొబైల్ లో వైరస్ ఉంటే స్లో అవుతుందని.. అలాంటప్పుడు అవసరంలేని యాప్స్ ను తొలగించాలని తెలియజేశారు. ముఖ్యంగా మనకు పబ్లిక్ లో దొరికే వైఫై వాడకపోవడం మంచిది అని తెలియజేశారు. వీటివల్ల మనం వాడే ఎటువంటి పరికరాలను హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: