బుల్లిపిట్ట: మూడు చక్రాల ఎలక్ట్రిక్ కారు.. ధర తక్కువే..!!

Divya
ముంబైకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సంస్థలలో ఒకటైన స్ట్రోమ్ మోటార్స్ స్ట్రోమ్ R-3 అనే ఎలక్ట్రిక్ కార్ ని గత సంవత్సరం ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాహనాలకు ఎక్కువ డిమాండ్ చేస్తూ భారీగా వీటి సేల్ పెంచుకుంది. ఆటో తరహాలో ఉండే ఈ కారు కు ముందు రెండు టైర్లు వెనుక ఒక టైరు మాత్రమే ఉంటుంది. దీనికి కేవలం రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. దీనిని 2,915 మిల్లీమీటర్ల పొడవు, వెడల్పు తో తయారు చేయబడిందట. ఎత్తు 545 మిల్లీమీటర్లు కలదు. ముందు భాగం మాత్రం మహేంద్ర E-2 O ను మోడల్ ను కలిగి ఉంటుంది.

ఈ కారును సరికొత్త టెక్నాలజీ కి జోడిస్తూ గ్రిల్ ఎలిమెంట్ ను అమర్చడం జరిగింది. కారును కుడి , ఎడమ వైపు బ్యాడ్ నైట్ వరకు డిజైన్ చేయడం జరిగింది. ఇరువైపులా హెక్సా గోనల్ డోర్స్ అమర్చడం జరిగిందట. అయితే ఈ కార్ల యొక్క ఫీచర్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1990 లో ఉండే మెర్సిడెజ్ అనే బెంజ్ కార్ లో ఉండేటువంటి లగ్జరీ ఫీచర్లను ఇందులో అమర్చినట్లు గా ఆ ఎలక్ట్రిక్  కార్ సంస్థ తెలియజేసింది. ఇందులో మూడు స్క్రీన్లను అమర్చడం జరిగిందట.  అందులో ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్, క్లైమేట్ కంట్రోల్ వంటి స్క్రీన్లను కూడా ఇందులో అమర్చడం జరిగిందట. ఇందులో ఒక్క స్క్రీన్ మాత్రమే ఏడు అడుగులు ఉంటుంది.  మిగిలిన రెండు స్క్రీన్లు మాత్రం 4.3 అంగుళాలు కలదు. ఇందులో సెంట్రల్ కన్సోల్ లో ఏసీ ద్వారా వచ్చే లోపలి గాలిని బయటకు కూడా పంపే విధంగా వీటిని తయారు చేశారు.
ఇందులో ఫోర్ జి కనెక్టివిటీ తో నావిగేషన్ వాయిస్ కంట్రోల్, సిగ్నల్ సిస్టం కూడా అందుబాటులో కలదట. ఇక వీటి చుట్టూ ఫ్రేమ్ స్టిల్ ఫ్రేమ్ ను అమర్చారు. ఈ కారు బరువు 550 కిలోల కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.4 నుంచి రూ.5 లక్షల లోపు ఉంటుంది. సుమారుగా ప్రతిరోజు 160 కార్లు బుక్ అవుతున్నట్లుగా కంపెనీ అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: