బుల్లిపిట్ట : మీ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ తో ఇబ్బందిగా ఉందా.. ఇలా చేయండి..!!

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక ప్రకటన మనకు కనిపిస్తూనే ఉంది. అదేమిటంటే ఇప్పుడు 4g కాదు 5g అంటూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇక అంతే కాకుండా మా నెట్వర్క్ లో కి మార్చండి అంటూ కూడా కొంతమంది టెలికాం సంస్థలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా 4g, 3g నెట్వర్క్ లేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నెట్వర్క్ లేకుండా ఎక్కడికి ఎవరు కాల్స్ మాట్లాడలేరు, చేసుకోలేరు. బ్యాడ్ మొబైల్ నెట్వర్ తో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారా అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ ను తెలియజేయడం జరుగుతుంది వాటి గురించి తెలుసుకుందాం.

1). మీ మొబైల్ నెట్వర్క్ రీస్టార్ట్ చేయడం వల్ల అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో ఏరోప్లేన్ మోడ్ ను ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయడం చెసి, ఆ తర్వాత మొబైల్ ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే నెట్వర్క్ స్పీడ్ పెరుగుతుందట.
2). ఇక మరొకటి ఏమిటంటే మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్  రీస్టార్ట్ చేయడం వల్ల మన మొబైల్ లో ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అవుతుంది.
3). ఇక మూడవది ఏమిటంటే మొబైల్ ఫోన్ ని రీస్టార్ట్ చేయడం వల్ల మీ మొబైల్ సరికొత్త మొబైల్ గా మారుతుంది. అయితే మొబైల్ ని ఎలా రీస్టార్ట్ చేయాలి అంటే.. పవర్ బటన్ ను అలాగే కొద్దిసేపు పట్టుకొని.. వ్యాల్యూ డౌన్లోడ్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఆ తరువాత అక్కడ చూపించిన విధంగా మొబైల్ ఫోన్ ని రీస్టార్ట్ చేయాలి.
ఒకవేళ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. మొబైల్ లో సిగ్నల్ సరిగ్గా లేకపోతే సిమ్ కార్డు ప్రాబ్లమ్  కావచ్చు దగ్గరలో ఉండే ఏదైనా  మీ సిమ్ కార్డ్ స్టోర్ కి వెళ్లి.. కొత్త సిమ్ కార్డు తీసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: