బుల్లిపిట్ట : ప్రముఖ బ్రాండ్ నుంచి అతి తక్కువ ధరకే 4K UHD స్మార్ట్ టీవీ..!

Divya
బడ్జెట్ ధరలో ఎవరైనా స్మార్ట్ టీవి కొనాలని చూస్తున్న వారికి ఒక కొత్త శుభవార్త తీసుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్స్ నుండి సరికొత్త స్మార్ట్ టీవీ లను డిస్కౌంట్ ధరలకే అందిస్తోంది.. ఫ్లిప్కార్ట్ సేల్ నుండి..23 వేల రూపాయలు కలిగిన ప్రముఖ బ్రాండ్ 4K UHD స్మార్ట్ టీవీ ని తమ కస్టమర్ల కోసం అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సేల్ మార్చి-27 నుండి ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్లు ఉండనున్నాయి. ఇక అంతే కాకుండా 10% బ్యాంకు డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. రూ.23 వేలకే బడ్జెట్లలో అతి తక్కువ ధరకే లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ యొక్క విశేషాలను చూద్దాం.
ఇక ఈ స్మార్ట్ టీవీ బ్రాండ్ పేరు..COOCAA నుండి వచ్చిన ఈ 43 ఇంచుల 4K UHD టీవీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. ఫ్లిప్ కార్ట్ లో దీనిపై 58% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో కేవలం మనకు రూ.22,999 రూపాయలకే ఆఫర్ కింద అందిస్తోంది. ఇక అంతే కాకుండా స్మార్ట్ టీవీ నుండి citi క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనే వారికి మరొక 10% ఇస్తుందట. ఒకవేళ ఫ్లిప్ కార్ట్ పే లెటర్ ద్వారా కొనుగోలు చేసిన కూడా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుందట.

Coocaa స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్:
ఈ బ్రాండెడ్ గల స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. 43 ఇంచుల సైజు 4k అల్ట్రా హెచ్డీ డిస్ప్లే కలదు. ఇక అంతే కాకుండా 465 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఇక దీని చుట్టూ ప్యానెల్..DLED ప్యానల్ తో కలదు. కనెక్టివిటీ పరంగా..3HDMI &2USB పోర్ట్స్ , WIFI సదుపాయం కూడా కలదు. సౌండ్ టెక్నాలజీ పరంగా..16W అందిస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో సరౌండింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో సౌండ్ అందించగలదు. ఆండ్రాయిడ్ 10 OS తో నడుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: