బుల్లి పిట్ట: భారీగా పెరుగుతున్న.. స్మార్ట్ మొబైల్, టీవీ ధరలు..!!

Divya
ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో.. స్మార్ట్ ఫోన్, టీవీలు లేకుండా ఎవరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే ఇవి రెండూ లేకుండా మానవుడు జీవితం కొనసాగడం చాలా కష్టం అన్నట్లుగా ఉంటోంది. అయితే గత రెండు సంవత్సరాల నుండి.. కరోనా కారణంగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు సైతం వీటిని కొనాలంటే చాలా భయపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వీటిపై ధరలు పెనుభారంగా మారనున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కరోనా మొట్టమొదటిగా చైనా లో విజృంభించింది. ఇప్పుడు తాజాగా మరొకసారి కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉండడం తో  చైనాలోని టెక్ హబ్ ప్రాంతం గా ప్రసిద్ధిచెందిన ప్రాంతాలలో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒకవేళ షేన్ జెన్ లాక్ డౌన్ విధించినట్లు అయితే.. త్వరలోనే స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్ లు అంటే ఎలక్ట్రిక్ వస్తువుల పై భారీగా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.. ఎందుచేతనంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ సరఫరా చేసే కొన్ని ముఖ్యమైన నగరాలలో షేన్ జెన్  కూడా ఒకటి. ఇక్కడి నుంచే దాదాపుగా భారతదేశానికి 20 నుంచి 50 శాతం వరకు ఉత్పత్తులను దిగుమతి అవుతూనే ఉంటాయట.
షేన్ జెన్  లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో.. అధికారులు లాక్ డౌన్  విధిస్తారని ప్రచారం జరుగుతున్నది. అక్కడ కేవలం మూడు వారాల పాటు లాక్ డౌన్ విధించారంటే మన దేశంలోకి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతులపై ప్రభావం చూపుతుందని సమాచారం. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్  నవ్ కేంద్ర సింగ్ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రమైన చీప్ కొరతను ఎదుర్కోవడంతో పాటుగా.. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉత్పత్తులలో భారీగా పతనమయ్యాయి అని తెలియజేశారు. ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభించడంతో స్మార్ట్ టీవీ, మొబైల్ పైన ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: