ప్రపంచంలోనే అతి గొప్ప సెర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్ సరికొత్తగా ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం 13 ను మొదటిసారి డెవలపర్ విడుదల చేయడం జరిగింది.. ఇకపోతే ఆండ్రాయిడ్ 12 అప్డేట్ వెర్షన్ లో కొత్త ఫీచర్లతో మనకు రానుంది.. ఇకపోతే ఇందులో అప్గ్రేడ్ చేసిన థీమ్స్ , గోప్యత వంటి వివరాలు కొత్త వెర్షన్ లో మనకు లభించనున్నాయి. ఇకపోతే గూగుల్ తన ఆండ్రాయిడ్ ఐఓఎస్ కోసం లాంగ్ టైం లైన్ ని కూడా షేర్ చేయడం జరిగింది.. తాజాగా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 13 రెండు డెవలపర్ రివ్యూలను తీసుకొచ్చింది. అయితే ఒకటి ఫిబ్రవరిలో మరొకటి మార్చిలో విడుదల కానున్నాయి.
ఏప్రిల్, మే ,జూన్, జూలై నెలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క టిగా 4 బీటా వెర్షన్ విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక ఆండ్రాయిడ్ 13 తుది వెర్షన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా రావచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ 13 లో సరి కొత్త ఆపరేటింగ్ సిస్టం , ఎకోసిస్టమ్ కి అనేక కొత్త ఫీచర్లను అనుసంధానం చేయబడింది. ఇకపోతే కొత్త ఫీచర్ల విషయమే వస్తే.. ఫోటో ఫికర్ ను తాజాగా పరిచయం చేయనుంది.. ఈ యాప్ లో సురక్షితంగా వీడియోలను అలాగే ఫోటోలను ఇతరులకు షేర్ చేయడానికి వినియోగదారులను తప్పకుండా అనుమతిస్తుంది..
ఇక అంతే కాదు ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వీడియో ఫైలును వీక్షించడానికి అనుమతి అవసరం లేకుండా షేర్ చేసిన ఫోటోలను , వీడియోలను యాక్సెస్ చేయడానికి కూడా అప్పట్లో ఈ ఫోటో ఫికర్ ఫీచర్ ను మనం ఉపయోగించవచ్చు. ఇక మరొకవైపు థీమ్ యాప్ చిహ్నాలను కూడా అనుమతి ఇవ్వడం జరిగింది.. ఇక వినియోగదారులు వాల్పేపర్ లేదా ఇతర టీం చిహ్నాలను ఎంచుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది.. అంతేకాదు స్థానికంగా వినియోగదారులు తమ లాంగ్వేజ్ ను ఎంచుకోవడానికి సరి కొత్త ఫీచర్ కూడా రానుంది. అంతేకాదు వైఫై ద్వారా దగ్గరలో ఉన్న ఇతర పరికరాలకు కనెక్ట్ కావడానికి లొకేషన్ అనుమతి లేకుండా ని కనెక్ట్ చేసుకునే విధంగా కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టారు.. వీటితో పాటు మరెన్నో అధునాతనమైన సెక్యూరిటీ ఫీచర్లను కూడా త్వరలోనే కొత్త వెర్షన్ లో తీసుకురానుంది గూగుల్.