ఇన్‌స్టాగ్రామ్ లో 10 వేల డాలర్ల బోనస్

Vimalatha
ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ ను ఆకర్షించడానికి మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు రీల్స్‌లో వీడియోలను పోస్ట్ చేసే వారికి $10,000 వరకు బోనస్‌లను అందిస్తోంది. ఓ నివేదిక ప్రకారం రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్‌లో భాగంగా రీల్స్ అని పిలువబడే చిన్న వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా సృష్టికర్తలు ఇప్పుడు $10,000 వరకు సంపాదించే అవకాశాన్ని పొందుతారు. బోనస్ ప్రోగ్రామ్ నియమాలు వినియోగదారులకు స్పష్టంగా ఇవ్వలేదు కంపెనీ. 50,000 కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న ఒక కంటెంట్ క్రియేటర్ నెలకు $1,000 సంపాదించాడు. అయితే ఎక్కువ మంది అనుచరులు ఉన్న కొందరు వ్యక్తులు కేవలం $600 మాత్రమే సంపాదించారు. ఇతర క్రియేటర్‌లు ఒక నెలలో వారు పోస్ట్ చేసిన అన్ని రీల్స్‌లో 1.7 మిలియన్ల వీక్షణలను చేరుకుంటే $800 ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం బోనస్ ప్రోగ్రామ్ కొంతమంది క్రియేటర్‌లతో దీన్ని పరీక్షిస్తుంది. ఈ బోనస్‌లు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ బోనస్ యూఎస్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కొత్త ఫీచర్లు  
మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ రెండు కొత్త ఫీచర్లను రీల్స్‌కు టెక్స్ట్-టు-స్పీచ్, వాయిస్ ఎఫెక్ట్‌లను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ టెక్స్ట్-టు-స్పీచ్ వినియోగదారులను వీడియోలలో వారి వాయిస్‌ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వాయిస్ ఎఫెక్ట్‌లను కూడా జోడించింది. కొత్త ఫీచర్‌తో, విభిన్న స్వరాలతో ఫన్నీ వీడియోలను రూపొందించడం ఇప్పుడు సులభం.

రీల్‌ను రూపొందించడంలో వాయిస్, ఆడియోను ఉపయోగించడం అత్యంత ఆహ్లాదకరమైన అంశాలలో ఒకటి అని మాకు తెలుసు! అందుకే 'వాయిస్ ఎఫెక్ట్స్', 'టెక్స్ట్ టు స్పీచ్' అనే రెండు కొత్త ఆడియో టూల్స్‌ను విడుదల చేస్తున్నాం. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లోని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కొత్త టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్‌ను జోడించడానికి క్లిప్‌కి టెక్స్ట్‌ని జోడించిన తర్వాత, కంపోజర్ స్క్రీన్ దిగువన ఉన్న టెక్స్ట్ బబుల్‌పై నొక్కండి. ఆపై మూడు చుక్కల మెను నుండి టెక్స్ట్-టు-స్పీచ్ ఎంచుకోండి అంటూ కంపెనీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: