ఇదేం పని జుకర్ బర్గ్ :లీకైన ఫేస్ బుక్ రహస్య పత్రాలు..?

MOHAN BABU
ఫేస్ బుక్ సీక్రెట్స్ బాగోతం బయటపడింది. పాండోరా పేపర్స్ తరహాలో ఇప్పుడు ఫేస్ బుక్ పేపర్స్ సంచలనంగా మారాయి. అమెరికాతో సహా భారత్ లో విద్వేష ప్రసంగాల వ్యాప్తిని ఫేస్ బుక్ అడ్డుకోలేక పోతుందని, ప్రజా ప్రయోజనాల కంటే దానికి లాభాలే ముఖ్యమని ఈ రహస్య పత్రాలు బహిర్గతం చేశాయి. భారత్ లో మోడీ ప్రభుత్వానికి ఫేస్ బుక్ అనుకూలంగా వ్యవహరిస్తోందని వెల్లడించాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు బయటపెట్టిన ఫేస్ బుక్ రహస్య పత్రాలు ప్రపంచవ్యాప్తంగా  మరో చర్చకు తెర తీశాయి. పాండోరా పేపర్స్ సృష్టించిన ప్రకంపన మరవకముందే ఇప్పుడు ఫేస్ బుక్ పేపర్స్ రహస్య పత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

 ఫేస్ బుక్ స్వార్థపూరితంగా నే కంపెనీ అంతర్గత పరిశోధనా విధానాలను ఇన్వెస్టర్లకు ప్రజలకు తెలియకుండా ఫేస్ బుక్ దాస్తుందని  వెల్లడయింది. అమెరికాలోని అసోసియేటెడ్ ప్రెస్ సహా 17 వార్తా సంస్థలు జట్టుకట్టి ఫేస్ బుక్ పేపర్స్  ప్రాజెక్టును చేపట్టాయి. సామాజిక మాధ్యమ సంస్థకు సంబంధించి వేలాది అంతర్గత పత్రాలు, సమాచారాన్ని వెలికి తీశాయి. ఫేస్ బుక్ మాజీ ప్రొడక్ట్ మేనేజర్ సంస్థ విధానాలపై గళమెత్తిన ఫ్రాన్సెస్ యుగెన్ ద్వారా ఈ పత్రాలను పొందగలిగాయి. ఐరోపా వార్తా సంస్థల కన్సార్షియానికి ఫేస్ బుక్ పేపర్స్ సమాచారం పొందేందుకు యాక్సెస్ ఉంది. ఫేస్బుక్ రహస్య పత్రాలకు సంబంధించిన విశ్లేషణను ఐరోపా వార్తా సంస్థలు ప్రచురించడం ప్రారంభించాయి. ఇందులో భారత్ తో పాటు అనేక దేశాల్లో ఫేస్బుక్ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ పని చేస్తున్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాయి. ఇదే విషయాన్ని ఫ్రాన్సెస్ యుగెన్ కూడా గత కొన్ని నెలలుగా సెక్యూరిటీ అండ్ ఎక్సన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించాయి. తమ యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఫేస్బుక్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, ఈ సామాజిక మాధ్యమం వల్ల పిల్లలకుఎలాంటి హాని కలుగుతుంది, రాజకీయ హింస లో ఎలా ఉంది వంటి  విషయాలపై ఈ పత్రాల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్యాపిటల్ ఘటన హింస దర్యాప్తులో భాగంగా అమెరికా కాంగ్రెస్ సభ్యుల ముందు కూడా ఇందుకు సంబంధించిన సమాచారం అందించారు. 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఫేస్బుక్ నిర్వహించిన అంతర్గత పరిశోధనలో భారత్ లో అభ్యంతరకర కంటెంట్ ను సంస్థ తొలగించలేక పోతుందని తేలినట్లు పత్రాల్లో పేర్కొంది. బిజెపి నుంచి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో విద్వేష ప్రసంగాల విషయంలో ఫేస్బుక్ సెలక్టివ్ గా వ్యవహరిస్తుందని గతేడాది అనుమానం వ్యక్తం చేశారు. ప్రపంచంలో రిస్క్ లో ఉన్న దేశాలు భారత్ ను ఒకటిగా ఫేస్బుక్ చూసింది.

హిందీ,బెంగాలీ భాషలో విద్వేష  ప్రసంగాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించింది. అయినా వీటి తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన సంఖ్యలో లాంగ్వేజ్ మోడరేటివ్ లను నియమించు కోలేదు. అమెరికాలో అతివాద భావజాలం పెరుగుతున్నట్లు తెలిసిన ఫేస్బుక్ చర్యలు చేపట్టలేకపోయిందని బహిర్గతం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: