స్మార్ట్‌ఫోన్ లో స్టోరేజ్ సమస్యా? ఎలా క్లియర్ చేయాలంటే ?

Vimalatha
మార్కెట్‌లో చాలా స్టోరేజ్ స్పేస్‌తో అనేక స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫోన్ లో స్టోరేజ్ స్పేస్ 128 GB లేదా 64 GB కంటే తక్కువగా ఉంటే భారీ గేమ్‌లు లేదా ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బార్ లో 'అవుట్ ఆఫ్ స్టోరేజ్' సందేశాన్ని చూడాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో క్రమంగా ఇంటర్నల్ మెమరీ ఫుల్ అవుతూ ఉంటుంది.
మీరు కొన్ని సులభమైన చిట్కాలతో ఇంటర్నల్ స్టోరేజ్ ను క్లియర్ చేయడం ద్వారా ఫోన్ పనితీరును మెరుగుపరచవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా డిలీట్ చేద్దామని చూసినప్పుడు అన్ని ఫైల్‌లు, యాప్‌లను కలిగి ఉండటం అవసరమని అన్పిస్తుంది.  అప్పుడు దేనినీ డిలీట్ చేయలేము. కొన్ని సార్లు స్టోరేజ్ సమస్య వల్ల కొత్త  విధానాలతో కొంత అదనపు మెమరీని పెంచడానికి ఇప్పటికే ప్రయత్నించి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మీకు ఈ సమస్య ఇక ఎదురవ్వదు.
స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ను ఎలా క్లియర్ చేయాలి ?
స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి
స్టోరేజ్ ను ఎంచుకోండి
 ఫైల్ వర్గాల జాబితాను చూస్తారు. స్టోరేజ్ ఎంత ఖాళీగా ఉందో అందులో తెలుస్తుంది
క్లియర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
గూగుల్ ఫైల్స్ యాప్ లేదా 'ఐటెమ్‌లను తీసివేయండి' ఫీచర్‌ను ఎంచుకునే ఆప్షన్ మీకు కన్పిస్తుంది
రిమూవ్ ఐటెమ్ ఫీచర్ ద్వారా మీరు బ్యాకప్ చేసిన ఫోటోలు, వీడియోలను తొలగించే అవకాశం ఉంటుంది
ఇంకా మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లు, తక్కువ ఉపయోగించిన యాప్‌లను కూడా తీసివేయవచ్చు.
క్యాచే మెమరీని ఎలా క్లియర్ చేయాలి?
ఫోన్ మెమరీలో ఎక్కువ భాగం క్యాచేలోకి వెళుతుంది. కాబట్టి ముందుగా దాన్ని క్లియర్ చేయండి. సెట్టింగ్‌లలో స్టోరేజ్ కు వెళ్లండి. ఇక్కడ ఉన్న వాటిని క్లియర్ చేయండి. ఇది మీ ఫైల్‌లలో దేనినీ తొలగించదు. అదనంగా స్మార్ట్ స్టోరేజ్ టోగుల్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ను ఖాళీ చేయడానికి మరొక ఆప్షన్ ఉంది. 'స్మార్ట్ స్టోరేజ్' టోగుల్ ఆన్ చేసినప్పుడు, పరికరం 30, 60 లేదా 90 రోజుల తర్వాత బ్యాకప్ చేసిన ఫోటోలను స్వయంగా తొలగిస్తుంది. స్టోరేజ్ నిండినప్పుడు కూడా ఇది బ్యాకప్ చేసిన ఫైల్‌లను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో అనవసరమైన యాప్‌లను ఉంచడం కూడా చాలా స్థలాన్ని తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: