బుల్లి పిట్ట: రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఫీచర్స్ అదుర్స్..?

Divya
పెట్రోల్ ధర ప్రతిరోజు పేరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇక సామాన్య ప్రజలు టూ వీలర్స్ నడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక అందుచేతనే ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా తయారుచేసి విడుదల చేస్తున్నారు. అలాంటి దిగ్గజ సంస్థల రివోల్ట్ సంస్థ కూడా ఒకటి. ఈ సంస్థ నుంచి ఒక ఎలక్ట్రానిక్ బైక్ సేల్స్ మొదలుకానుంది. ఈ బైక్ ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారట. వాటి వివరాలను చూద్దాం.
రివోల్ట్ RV 400 బైక్ యొక్క విశేషాలు:

ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1.7 లక్షలు గా నిర్ణయించారు. ఈ బైక్ ని తీసుకోవాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవాలి. ఈ  బైక్ భారతదేశంలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ బైక్ పై సబ్సిడీ కూడా అందుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ సంస్థ నుంచి 70 నగరాలకు పైగా ఫ్రీ బుకింగ్ను విడుదల చేసింది.
వీటిలో ముఖ్యంగా ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ, చెన్నై,కోల్ కత్తా మిగిలిన మెట్రోనగరాల్లో కూడా  ఈ బైకు ని బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కలిగించింది. ఇందులో కొత్త రంగుల కాస్ట్యూమ్స్తో తోఈ బైక్ను విడుదల చేసినట్లుగా సమాచారం.
ఈ ఎలక్ట్రిక్ బైక్ 5 గంటల ఛార్జింగ్ చేస్తే..85 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని తెలియజేస్తున్నారు కంపెనీవారు. ఇక ఇందులో రివాల్ట్  అనే యాప్ ను అమర్చబడి ఉంటుంది. ఇందులో లొకేషన్ ట్రాకింగ్, హిస్టరీ, బైక్ కండిషన్, బ్యాటరీ కండిషన్ తో పాటు కొన్ని సదుపాయాలను కూడా అనుమతిస్తుందట. ఈ రివోల్ట్ బైకును ఎక్కడైనా సరే సులువుగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఇది మన ఇళ్ళల్లో, కార్యాలయాల్లో ఉండే స్విచ్ బార్డ్లతోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. చార్జింగ్ లో ఇది చాలా ప్రత్యేకమైన చార్జింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ నీటితో తడిసిన కూడా ఏమి కాదట. ఎక్కువ వెయ్యటం కూడా మోయగలిగే సామర్థ్యం ఈ బైక్ కి ఉన్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: