బుల్లిపిట్ట: జవాన్ల కోసం శత్రు జాడ కనుక్కునేందుకు సరికొత్త పరికరం..?

Divya
మన జవాన్లు ఎంత కష్ట పడుతున్నారో మనం వీడియోలు చూస్తూ ఉంటాము. అయితే ఇక శత్రువు చేతుల్లో కూడా ఎంతోమంది వీరమరణం పొందిన వాళ్లను కూడా మనం చూసే ఉంటాము.అయితే ఇప్పుడు సరికొత్త పరికరం ద్వారా శత్రువులను ఎక్కడ ఉన్నా కనిపెట్టే విధంగా ఒక పరికరాన్ని కనుగొన్నారు ఆ వివరాలను చూద్దాం.
ఈ పరికరాన్ని మిలటరీ ఎక్స్పోలో వచ్చే వారంలో ప్యారిస్లో మొదటిసారిగా ప్రదర్శిస్తున్నారు. ఈ పరికరం పేరు..xaver LR40  ఈ పరికరం శత్రువు యాభై మీటర్ల దూరంలో ఉన్న కూడా గుర్తించగలదట. ఇక ఈ పరికరం బరువు కూడా అతి తక్కువ గానే ఉన్నట్లు సమాచారం. దీని ప్రత్యేకత ఏమిటంటే గోడ అవతల దాగి ఉన్న శత్రువులను సైతం గుర్తించగలరు అన్నట్లుగా సమాచారం అంతేకాకుండా వారు ఎంతమంది ఉన్నారో కూడా లెక్కించగాలదట.
ఈ పరికరం మన హృదయం యొక్క స్పందన రేటును కూడా అ గుర్తించగలదు. దీనిని ఎక్స్ గ్రూప్ కమారో టెక్ అనే దిగ్గజ సంస్థ కనుగొంది. ఇక ఈ హృదయ స్పందన ఆధారంగా గోడ అవతల ఉన్న శత్రువు కూడా గుర్తించే టెక్నాలజీని కనుగొన్నారు. శత్రువుల జాడను అతి తొందరగా మనకి తెలియజేస్తుందట. ఇది ముఖ్యంగా ఏదైనా సైనికులు రహస్య ఆపరేషన్ చేసేటప్పుడు దీనిని బాగా ఉపయోగపడుతుందని ఆ పరిశోధకులు తెలియజేశారు.
ఏడాదిలో రెండుసార్లు హోం ల్యాండింగ్ సెక్యూరిటీ గురించి ప్యారిస్ వీటి ప్రదర్శన జరుగుతుంది. అందుచేతనే ఇజ్రాయిల్ కంపెనీ తన కొత్త వ్యవస్థని అక్కడ ప్రదర్శించనుంది. 55 దేశాలకు చెందిన 1000 మంది రక్షణ వ్యవస్థలో గల అధికారులు అందులో పాల్గొంటారు అన్నట్లుగా తెలియజేస్తోంది. అక్కడ 30000 మందికి పైగా వీక్షించడానికి హాజరవుతారట. కమారో సీఈవో అమీర్ బెర్రీ మాట్లాడుతూ.. ఈ పరికరాన్ని మొదటిసారిగా ప్రవేశ పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు. అంతేకాకుండా మనం వాహనం లోపల నుంచి అయినా చూసుకోవచ్చు అన్నట్లుగా తెలియజేశారు. దీనిని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అని కమారో సీఈఓ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: